మారుతీ ఎస్ క్రాస్ వచ్చేసింది | Maruti S-Cross came out | Sakshi
Sakshi News home page

మారుతీ ఎస్ క్రాస్ వచ్చేసింది

Published Thu, Aug 6 2015 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

మారుతీ ఎస్ క్రాస్ వచ్చేసింది

మారుతీ ఎస్ క్రాస్ వచ్చేసింది

 డీజిల్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభ్యం
♦ ధరలు రూ.8.32-13.74 లక్షల రేంజ్‌లో
♦ నెక్సా అవుట్‌లెట్ల ద్వారా విక్రయం
 
 న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ కంపెనీ ఎస్ క్రాస్ కారును బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం సెగ్మెంట్లో వాటా పెంచుకోవడం లక్ష్యంగా మారుతీ అందిస్తున్న ఈ కారు ధరలు  రూ.8.32 లక్షల నుంచి రూ.13.74 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో ఉన్నాయి. డీజిల్ ఇంజిన్‌లో రెండు వేరియంట్లలో -1.3 లీటర్(డీడీఐఎస్ 200), 1.6 లీటర్ (డీడీఐఎస్ 320).. ఎస్ క్రాస్ కారును అందిస్తున్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. హ్యుందాయ్ ఇటీవలనే విడుదల చేసిన క్రెటా, రెనో ఎస్‌యూవీ డస్టర్‌లకు ఈ మారుతీ ఎస్ క్రాస్ గట్టి పోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డస్టర్, క్రెటా కార్లతో పోల్చితే ఎస్ క్రాస్ బేస్ మోడల్ ధర రూ.లక్ష తక్కువగా ఉంది. కొత్తగా ప్రారంభించిన నెక్సా అవుట్‌లెట్లలో ఈ కార్లను విక్రయిస్తారు.

 ఇప్పటికే 6 వేల బుకింగ్‌లు..  
 ఈ కేటగిరి కార్లలో పెట్రోల్ వేరియంట్ల అమ్మకాలు తక్కువగా ఉంటాయని అందుకే పెట్రోల్ వేరియంట్‌ను ఈ మోడల్‌లో ఆఫర్ చేయడం లేదని కంపెనీ పేర్కొంది. డీజిల్‌లో 1.3 లీటర్ ఇంజిన్ ఆప్షన్ ధరలు రూ.8.34 లక్షల నుంచి రూ.10.75 లక్షల రేంజ్‌లో ఉన్నాయని, సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా వేరియంట్లను అందిస్తున్నామని అయుకవ చెప్పారు. 5 గేర్లు ఉండే ఈ వేరియంట్‌లు 23.65 కి.మీ. మైలేజీని ఇస్తాయని వివరించారు. ఇక 1.6 లీటర్ వేరి యంట్ ధరలు రూ.11.99 లక్షల నుంచి రూ.13.74 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆరు గేర్లు ఉండే ఈ వేరియంట్ కార్లు  22 కి.మీ. మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు.  ప్రయాణికుల వాహ నాల సెగ్మెంట్లో తమ వాటా 45 శాతమని  ఈ కొత్త మోడల్‌తో ఈ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. నెలకు 3,000-4,000 వరకూ ఈ కార్లను విక్రయించడం లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఆరువేల బుకింగ్‌లు వచ్చాయని వివరించారు.

 నెక్సా ద్వారా మరిన్ని ప్రీమియం కార్లు...
 నెక్సా  అవుట్ లెట్ల ద్వారా విక్రయించడానికి భవిష్యత్తులో మరిన్ని ప్రీమియం కార్లను అందిస్తామని అయుకవ చెప్పారు. ప్రస్తుతం 23 నగరాల్లో 35 నెక్సా షోరూమ్‌లను ప్రారంభించామని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 30 నగరాల్లో వంద షోరూమ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నామని తెలిపారు. విదేశాలకు కూడా ఈ కారును ఎగుమతి చేయాలని యోచిస్తున్నామని, కానీ దేశీయ మార్కెట్‌పైననే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు.
 
 కారు ప్రత్యేకతలు...
 టాప్ ఎండ్ మోడల్‌లో టచ్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్ సిస్టమ్, శాటిలైట్ నావిగేషన్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కంట్రోల్స్ ఉన్న స్టీరింగ్ వీల్,  ప్రొజెక్టర్ లైట్స్‌తో కూడిన ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్,  కీలెస్ ఎంట్రీ, రియర్ కెమెరా, పార్కింగ్ సెన్సర్లు, వెనక భాగంలో రిక్లెయినింగ్ సీట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement