
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సంచలన నిర్ణయం తీసుకున్నారు. 36 బిలియన్ డాలర్ల విలువైన 3,28,000 షేర్లను సత్య నాదెళ్ల విక్రయించారు. సత్య నాదెళ్ల చేపట్టిన స్టాక్ సేల్‌లో ఇదే అతిపెద్దది. వ్యక్తిగత ఆర్థిక కారణాలతో ఈ షేర్లను విక్రయించినట్టు తెలిసింది. వచ్చే ఏడాదిలో కూడా నాదెళ్ల నిర్మాణాత్మక ప్రణాళిక ద్వారా వాటాలను విక్రయించడం కొనసాగిస్తారని కంపెనీ తెలిపింది.
ఈ ప్లాన్ కింద ప్రస్తుతం కొన్ని మైక్రోసాఫ్ట్ షేర్లను విక్రయించారని పేర్కొంది. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన తర్వాత కంపెనీ స్టాక్‌ను విక్రయించడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను నాదెళ్ల విక్రయించారు. 2014లో సత్య నాదెళ్ల సీఈవో అయ్యారు. తాజాగా విక్రయించిన షేరు వ్యక్తిగత ఆర్థిక కారణాలతో విక్రయించినట్టు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కంపెనీని గెలుపు బాటలో నడిపించడానికి నాదెళ్ల ఎల్లప్పుడు కృషి చేస్తూ ఉంటారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment