ట్రక్‌ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో | Mining ban impacts Volvo Trucks sale | Sakshi
Sakshi News home page

ట్రక్‌ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో

Published Sat, Jun 14 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

ట్రక్‌ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో

ట్రక్‌ల అమ్మకాలు బాగుంటాయ్: వోల్వో

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక ఉత్పత్తి ఈ ఏడాది 4 శాతం పెరుగుతుందన్న అంచనాలున్నాయని వోల్వో ట్రక్స్ తెలిపింది. మైనింగ్, నిర్మాణ రంగ కార్యకలాపాల పునరారంభం పెద్ద ఎత్తున ఉండబోతోందని, ఈ నేపథ్యంలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో వృద్ధి ఆశిస్తున్నామని ఏబీ వోల్వో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ డివ్రీ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 200 బొగ్గు క్షేత్రాలు తెరుచుకునే అవకాశముందని, దీంతో ట్రక్‌ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయన్నారు.
 
మైనింగ్ నిషేధం, బొగ్గు క్షేత్రాల కేటాయింపుల రద్దు, మందగమన ప్రభావం కంపెనీపైనా పడిందని వీఈ కమర్షియల్ వెహికల్స్ సీఈవో వినోద్ అగర్వాల్ పేర్కొన్నారు. 2011లో 1,100ల ట్రక్‌లు విక్రయిస్తే, 2013లో 700 ట్రక్‌లకే పరిమిత మయ్యామని చెప్పారు. ‘ట్రక్ యజమానులు వ్యాపారాలు లేక నెల వాయిదాలు కట్టలేకపోయారు. ఫైనాన్స్ సంస్థలు కొత్త వాహనాలకు ఫైనాన్స్ నిరాకరించాయి. ఈ కారణంగా వాహనాల అమ్మకాలు పెద్దగా నమోదు కాలేద’ని అన్నారు. 2016లో 1,000 ట్రక్‌ల విక్రయాలకు చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
హెవీ డ్యూటీ విక్రయాల్లో..
గతేడాదితో పోలిస్తే 2014 జనవరి-మే కాలంలో 16 టన్నులు, ఆపై సామర్థ్యంగల హెవీ డ్యూటీ ట్రక్‌ల విక్రయాల్లో 30 శాతం వృద్ధి చెందామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామారావు ఏఎస్ తెలిపారు. ఈ విభాగం మార్కెట్ పరిమాణం దేశంలో 1,500 యూనిట్లుందని వోల్వో గ్రూప్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. 150-225 టన్నులు మోయగల భారీ ట్రక్‌లు 500 దాకా వోల్వో విక్రయించింది. ఇంధన పొదుపు దిశగా డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఫ్యూయెల్ వాచ్ పేరుతో వోల్వో గత ఐదేళ్లుగా పోటీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోటీలకు కొత్తగూడెం సమీపంలోని మణుగూరు సింగరేణి గనులు వేదికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement