మనీగ్రామ్ రంజాన్ ఆఫర్.. | money gram ramzan offer | Sakshi
Sakshi News home page

మనీగ్రామ్ రంజాన్ ఆఫర్..

Published Sat, Jun 4 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

మనీగ్రామ్ రంజాన్ ఆఫర్..

మనీగ్రామ్ రంజాన్ ఆఫర్..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు బదిలీ సేవల రంగంలో ఉన్న మనీగ్రామ్.. రంజాన్ ఆఫర్‌ను ప్రకటించింది. బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీ శుక్రవారమిక్కడ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. జూన్ 6 నుంచి మొదలై రంజాన్ నెల పూర్తి అయ్యే వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రథమ బహుమతి కింద ఇద్దరు వ్యక్తులకు ఉమ్రా (మక్కా) వె ళ్లే అవకాశం లభిస్తుంది. రానుపోను అన్ని ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. టెలివిజన్ సెట్స్, స్మార్ట్‌ఫోన్లు సైతం గెలుపొందవచ్చని కంపెనీ తెలిపింది. ఉచితంగా అంతర్జాతీయ కాల్స్ చేసుకునే అవకాశమూ ఉంది. విదేశాల నుంచి మనీగ్రామ్ ద్వారా నగదును స్వీకరించే కస్టమర్లు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఈ క్యాంపెయిన్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement