
భారీగా పెరిగిన నాట్కో ఫార్మా లాభం
న్యూఢిల్లీ: నాట్కో ఫార్మా నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు రెట్టింపునకు పైగా పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.24 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.54 కోట్లకు పెరిగిందని నాట్కో ఫార్మా పేర్కొంది. రూ.31 కోట్ల ట్యాక్స్ రివర్సల్ కారణంగా నికర లాభం ఈ స్థాయికి పెరిగిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.184 కోట్ల నుంచి రూ.201 కోట్లకు వృద్ధి చెందిందని పేర్కొంది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్‌కు రూ.450 కోట్ల వరకూ షేర్ల జారీకి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు, పూర్తి అనుబంధ సంస్థ నాట్కో ఆర్గానిక్స్ విలీనానికి కూడా బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది.