రంగారెడ్డి జిల్లాలో కాగ్నిజెంట్ సెజ్ కు ఓకే
కొత్తగా 4 సెజ్‌లకు అనుమతులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. వీటిలో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సర్వీసెస్, సాల్టైర్ డెవలపర్స్, అమీన్ ప్రాపర్టీస్ సెజ్‌లు ఉన్నాయి. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దాదాపు 2.51 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ జోన్ ఏర్పాటు చేయనుంది. ఇన్ఫోసిస్ మొహాలీలో దాదాపు 20.23 హెక్టార్లలో ఐటీ/ఐటీఈఎస్ సెజ్‌ను నెలకొల్పనుంది. మరోవైపు, 12 మంది డెవలపర్ల ప్రాజెక్టుల అమలుకు మరికాస్త సమయం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా సారథ్యంలోని బోర్డ్ ఆఫ్ అప్రూవల్ (బీవోఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.