ఓఎన్జీసీ లాభం21 శాతం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ లాభం జూన్ త్రైమాసికంలో 21 శాతం క్షీణించింది. రూ. 4,233 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసిక లాభం రూ.5,368 కోట్లు. ఆదాయం సైతం 21.41% క్షీణించి రూ.17,784 కోట్లకు పరిమితం అయింది. చమురు ధరలు, ఉత్పత్తి తగ్గిపోవడం లాభాల క్షీణతకు దారి తీసింది.
బ్యారెల్ క్రూడ్ ఆయిల్‌పై ఈ కాలంలో వచ్చిన ఆదాయం 46.10 డాల ర్లుగా ఉండగా, గతేడాది జూన్ త్రైమాసికంలో ఇది 59.08 డాల ర్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్‌పై 34% తక్కువగా 3.06 డాలర్ల ఆదా యం వచ్చినట్టు పేర్కొంది. చమురు ఉత్పత్తి 2%క్షీణించి 6.01 మిలియన్ టన్నులుగా ఉండగా, గ్యాస్ ఉత్పత్తి సైతం 5.55% తగ్గి 5.49 బిలియన్ క్యుబిక్ మీటర్లుగా ఉందని తెలిపింది.