పర్యావరణమే ప్రగతి పథం!
భాగ్యనగరం అభివృద్ధి అనేది చార్మినార్‌తో మొదలై కోఠి, అబిడ్స్, సోమాజిగూడ, మాదాపూర్‌లకు విస్తరించింది. అయితే ఇప్పుడీ వృద్ధి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరింది.
‘సాక్షి రియల్టీ’తో ప్రగతి గ్రూప్ చైర్మన్ జీబీకే రావు
• ఓఆర్‌ఆర్ చుట్టూ ప్రగతి ప్రాజెక్ట్‌ల అభివృద్ధి
• 5 శాతంలోపే నిర్మాణాలు; మిగిలినదంతా గ్రీనరీకే
• విశాఖలో ప్రగతి బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్
• ప్రభుత్వంతో ఎంవోయూ పూర్తి; త్వరలోనే ప్రారంభం
సాక్షి, హైదరాబాద్
భాగ్యనగరం అభివృద్ధి అనేది చార్మినార్‌తో మొదలై కోఠి, అబిడ్స్, సోమాజిగూడ, మాదాపూర్‌లకు విస్తరించింది. అయితే ఇప్పుడీ వృద్ధి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరింది. అయితే ఈ విస్తరణలో మనం చేయాల్సింది ఒక్కటే.. విస్తరించిన ప్రతి చోటా గ్రీనరీని పెంచడమే! అప్పుడే రెండు ప్రాంతాలు కూడా పర్యావరణహితమవుతాయి. ప్రభుత్వం కూడా ఓఆర్‌ఆర్ చుట్టూ గార్డెన్ సిటీలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రగతి గ్రూప్ సీఎండీ డాక్టర్ జీబీకే రావు అభిప్రాయపడ్డారు. వంద ఎకరాల్లో విస్తీర్ణంలో 75 శాతం గ్రీనరీకి, మిగిలినదాంట్లో నిర్మాణాలు వచ్చేలా టౌన్‌షిప్పులను నిర్మించాలని సూచించారు. ప్రగతి రిసార్ట్స్ పేరిట ప్రపంచ దేశాల దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించిన ప్రగతి గ్రూప్ ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఓ బృహత్తర ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది. వాటి విశేషాలను ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారాయన.
⇔ నగరంలో స్థలం కొరత కారణంగా ఉన్న భవనాలను కూల్చేసి.. తిరిగి వాటి స్థానంలోనే ఎక్కువ అంతస్తులు కట్టేస్తున్నారు. గాలి కూడా సరిగా ప్రసరించని ఇంట్లో ఉండాల్సి వస్తోంది. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్లు లేనిదే ఉండలేని పరిస్థితి. కనీసం 50 శాతం గ్రీనరీ ఉండే ప్రాజెక్ట్‌ల్లో ఉండాల్సిన మనం.. 5 శాతం కూడా గ్రీనరీ లేని ఇరుకిళ్లలో ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకే భారీ విస్తీర్ణంలో గ్రీనరీకే అధిక ప్రాధాన్యమిచ్చే ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తున్నాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డును ఆధారం చేసుకొని పలు ప్రాజెక్ట్‌లకు చేస్తున్నాం.
⇔ ప్రగతి రిసార్ట్ లాగే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రగతి ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించాం. అందుకే విశాఖపట్నంలోని ఆనందపురం మండలంలో బయోడైవర్సిటీ నాలెడ్జ్ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నాం. 250 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో 10 లక్షల మొక్కలతో పాటూ పలు రకాల జీవరాశులూ ఉంటాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే పచ్చని ప్రకృతితో జీవవైవిధ్యం ఉట్టిపడుతుందిక్కడ. ప్రభుత్వంతో ఎంవోయూ కూడా పూర్తయింది. త్వరలోనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించి పదేళ్లలో పూర్తి చేస్తాం.
⇔ యాదాద్రిలో 125 ఎకరాల్లో ప్రగతి యాదరుషి టౌన్‌షిప్ పేరిట హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్‌ను చేస్తున్నాం. తొలి దశలో 40 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 150, 200, 250 గజాల్లో మొత్తం 400 ఓపెన్ ప్లాట్స్ వస్తాయి. గజం ధరం రూ.3,600. గోశాల, నక్షత్ర వనం, కార్తీక వనం, ఔషధ మొక్కల పార్క్, చిల్డ్రన్స్ పార్క్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల వసతులుంటాయిందులో.
⇔ భువనగిరి దాటాక చిన్న కందుకూరు గ్రామంలో 100 ఎకరాల్లో ప్రగతి స్ఫూర్తి పేరిట డీటీసీపీ అనుమతి పొందిన లే అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో మొత్తం 800 ప్లాట్లొస్తాయి. గజం ధర రూ.3 వేలు.
⇔ మొయినాబాద్ మండలంలోని వీరన్నపేటలో ప్రగతి గ్రీన్ వ్యాలీ డీ సెక్టార్‌లో 40 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో గజం ధరం రూ.3 వేలు. సులభ వాయిదా పద్ధతుల్లోనూ ప్లాట్లను తీసుకునే వీలుంది. పొద్దుటూరులో 2,500
ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రగతి రిసార్ట్‌లోనూ కొన్ని ప్లాట్లున్నాయి. ఇందులో గజం ధర రూ.4,500.
⇔ మొయినాబాద్ మండలంలో 2,500 ఎకరాల్లో విస్తరించి ఉంది ప్రగతి రిసార్ట్స్. ఇందులో 30 లక్షలకు పైగా ఔషధ మొక్కలున్నాయి. మాంసరోహిణి, బ్రహ్మ ఆమ్లిక, బ్రహ్మ మేడి, అశోక సీత, కమండలం, గుగ్గులు వంటి అంతరించిపోతున్న 650 రకాల మొక్కలున్నాయి. వీటిని శ్రీశైలం అడవులు, అస్సాం, నేపాల్, కశ్మీర్ వంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి.. స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కోల్డ్ స్టోరేజీ భద్రపరుస్తూ మొక్కలను పెంచుతారు. రిసార్ట్‌లో డీఎస్‌ఆర్‌ఐ అనుమతి పొందిన ల్యాబ్ కూడా ఉంది. ఇందులో 150 రకాల ఆయుర్వేద మందులను తయా రు చేస్తున్నారు. ఇప్పటికే మస్క్రలర్ డిస్ట్రోఫీ, డయాబెటిస్ హనీ వంటి మందులకు పేటెంట్లను తీసుకున్నారు కూడా. అయితే వ్యాపా ర నిర్వహణ నిమిత్తం ఓపెన్ ప్లాట్స్‌ను చేస్తున్నాం. రిసార్ట్‌లో ప్లాట్స్ కొన్నవారంతా ఇళ్లు కట్టుకున్నా సరే నిర్మాణాలు 5 శాతం లోపే ఉంటాయి. మిగిలినదంతా గ్రీనరీనే.
ఎవరు ఇంటికొచ్చినా ముందుగా వారికి స్వాగతం పలికేవి ఇంటి తలుపులే. అందుకే సింహద్వారం ఎంత అందంగా ఉంటే ఆ ఇల్లు అందమైన పొదరిల్లు అవుతుంది. గతంలో తలుపులు, కిటికీలంటే చెక్కతో చేయించేవారు. కాస్త ఉన్నవాళ్లయితే కలపతో చేయించిన తలుపులు, కిటికీలను వాడేవారు. అయితే ఇవి కొన్నేళ్లయితే చెదలు పట్టడం, పాడవటం వంటివి జరుగుతుండేవి. అందుకే వాటి స్థానంలో యూపీవీసీ తలుపులు, కిటికీలు వచ్చి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును తెచ్చాయి. వీటి ధరలు అందుబాటులో ఉండటం, మన్నిక కూడా ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో యూపీవీసీ తలుపులు, కిటికీలకు డిమాండ్ పెరుగుతోంది.
అన్‌ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్‌ను సంక్షిప్తంగా యూపీవీసీ అంటాం. దేశవ్యాప్తంగా తలుపులు, కిటికీల మార్కెట్ పరిమాణం ఏటా రూ.15 వేల కోట్లుగా ఉండగా, ఇందులో యూపీవీసీ తలుపులు, కిటికీల వాటా 20 శాతం వృద్ధి రేటుతో రూ.3 వేల కోట్లుగా ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన యూపీవీసీ తలుపులు, కిటికీల వాడకం ప్రస్తుతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరించింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం దీని ప్రత్యేకత. ఎక్కువ జీవితకాలం, పర్యావరణ అనుకూలం కలిసొచ్చే అంశాలు.
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలు మాకు రాయండి.


