ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్టార్టప్‌ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది.
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్టార్టప్‌ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. తాజాగా ఆయన హోమ్ రెంటల్ కంపెనీ నెస్ట్‌అవే టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో ఇది ఆయనకు స్టార్టప్‌ల్లో ఎనిమిదో పెట్టుబడి. అయితే ఎంత మొత్తంలో రతన్ టాటా ఇన్వెస్ట్ చేసింది వివరాలు వెల్లడి కాలేదు. మొత్తం మీద ఆయన ఇప్పటిరకూ 20కు పైగా స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. ఫర్నిచర్ లేని ఇళ్లను ఫర్నిచర్‌తో నింపి చౌకధరల్లో కిరాయికి ఇవ్వడం, అపార్ట్‌మెంట్‌ల నిర్వహణ తదితర కార్యకలాపాలను నెస్ట్‌అవే టెక్నాలజీస్ నిర్వహిస్తోంది. ఆరు నగరాల్లో 5,000 మందికి నాణ్యత గల ఇళ్లను అద్దెకు ఇచ్చామని నెస్ట్‌అవే టెక్నాలజీస్‌లో ఇన్వెస్ట్ చేసిన ఐడీజీ వెంచర్స్ ఇండియా పేర్కొంది.