
న్యూఇయర్ కానుకగా రెండు రోజుల క్రితమే రెండు అదిరిపోయే ప్లాన్లను లాంచ్ చేసిన రిలయన్స్ జియో... మరో బంపర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. 'సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్' పేరుతో జియో తన కస్టమర్ల ముందుకు వచ్చింది. రూ.399 లేదా ఆపై అన్ని రీఛార్జ్‌లపై రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వచ్చే ఏడాది జనవరి 15 వరకు రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. రూ.399 రీఛార్జ్‌పై జియో అందిస్తున్న రూ.2599 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు నిన్నటితోనే గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో జియో తన కస్టమర్ల ప్రవేశపెట్టింది.
''రూ.399, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై రూ.3,300 వరకు జియో సర్‌ప్రైజ్ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.400 మైజియో క్యాష్‌బ్యాక్ ఓచర్లు, వాలెట్ల నుంచి రూ.300 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ ఓచర్లు, ఈ-కామర్స్ ప్లేయర్ల నుంచి రూ.2,600 డిస్కౌంట్ ఓచర్ల రూపంలో ఆఫర్ చేస్తుంది'' అని కంపెనీ వర్గాలు తెలిపాయి. 2017 డిసెంబర్ 26 నుంచి 2018 జనవరి 15 వరకు మధ్యలో చేయించుకున్న అన్ని రీఛార్జ్‌లకు ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉండనుందని పేర్కొన్నాయి.
కాగ, జియో అందిస్తున్న ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ నిన్నటితో ముగిసింది. నవంబర్ 10 నుంచి ఈ ఆఫర్‌ను అందిస్తూ వచ్చింది. టారిఫ్‌ల విషయంలో జియో ఎప్పటికీ లీడరేనని, కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, టారిఫ్‌ల విషయంలో ఎంతదూరమైనా వెళ్లే ఒకే ఒక్క కంపెనీ తమదేనని జియో ప్రకటించింది. శుక్రవారమే జియో న్యూఇయర్ కానుకగా రూ.199, రూ.299తో రెండు నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment