జియోకి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు: సీఓఏఐ
న్యూఢిల్లీ: దొడ్డిదారిలో వచ్చిన ఆపరేటర్ (బ్యాక్ డోర్ ఆపరేటర్) అంటూ తమపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలన్న రిలయన్స్ జియో డిమాండ్‌ను సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ తోసిపుచ్చారు. అలాగే, సీఓఏఐ నిబంధనలను మార్చాలన్న డిమాం డ్‌ను సైతం తిరస్కరించారు. బ్యాక్‌డోర్ ఆపరేటర్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమని, వీటిపై మాథ్యూస్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు చేపడతామని జియో బుధవారం ప్రకటన జారీ చేసింది.