రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్ ప్రత్యేక వెబ్‌సైట్.. | Reliance 'Life 'mobiles Special Website .. | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్ ప్రత్యేక వెబ్‌సైట్..

Published Mon, Feb 29 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM

రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్ ప్రత్యేక వెబ్‌సైట్..

రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్ ప్రత్యేక వెబ్‌సైట్..

ఎంట్రీ లెవెల్లో రెండు మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా వేగం పెంచుతోంది. 2016 ద్వితీయార్థంలో 4జీ సేవలను ఆవిష్కరించనున్న ఈ సంస్థ మొబైళ్ల కోసం మైలైఫ్.కామ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఎర్త్, వాటర్, విండ్, ఫ్లేమ్ శ్రేణి మోడళ్లను ఈ వెబ్‌సైట్లో ప్రదర్శిస్తోంది. వెబ్‌సైట్ ద్వారా ఫోన్‌ను కొనుక్కునే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఆసక్తిగల కస్టమర్ల వివరాలను మాత్రమే వెబ్‌సైట్ ద్వారా సేకరిస్తున్నారు. లైఫ్ మొబైళ్లు లభించే సమీపంలో ఉన్న స్టోర్లను ఈ పోర్టల్ ద్వారా కస్టమర్లు తెలుసుకోవచ్చు.

రిలయన్స్ డిజిటల్, లాట్, బిగ్ సి, సంగీత మొబైల్స్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్, ఈజోన్, యూనివర్‌సెల్, స్పైస్ తదితర స్టోర్లలో లైఫ్ ఫోన్లను కంపెనీ విక్రయిస్తోంది. కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది.
 
ఎంట్రీ లెవెల్లోకి ఎంట్రీ..
రిలయన్స్ రిటైల్ తాజాగా లైఫ్ విండ్-6, లైఫ్ ఫ్లేమ్-1 పేర్లతో ఎంట్రీ లెవెల్ 4జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టింది. అసలైన్ 4జీ అనుభూతి కోసం వీటిలో వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ, వాయిస్ ఓవర్ వైఫై ఫీచర్లను జోడించింది. 1.1 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ, రెండు వైపులా 5 ఎంపీ కెమెరా, డ్యూయల్ సిమ్ పొందుపరిచింది. విండ్-6 ధర రూ.7,499. ఫ్లేమ్-1 ధర రూ.6,699. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement