రాయల్టీ చెల్లింపులు @రూ.7,100 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో 32 లిస్టెడ్ ఎంఎన్‌సీల చెల్లింపులు ఇవి
న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టైన దాదాపు 32 బహుళ జాతి కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం(2015–16)లో తమ మాతృ కంపెనీలకు రాయల్టీగా రూ.7,100 కోట్లు చెల్లించాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపులు(రూ.6,300 కోట్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికమని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఐఐఏఎస్ సంస్థ వెల్లడించింది.
దీని ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో ఈ 32 కంపెనీల నికర అమ్మకాలు 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 32 బహుళజాతి కంపెనీలు రూ.7,100 కోట్లు రాయల్టీని చెల్లించగా, దీంట్లో కేవలం ఐదు ప్రముఖ కంపెనీలు(మారుతీ సుజుకీ, హిందుస్తాన్ యునిలివర్, ఏబీబీ, నెస్లే ఇండియా, బాష్) చెల్లించిన రాయల్టీలు రూ.5,540 కోట్లు(78 శాతం) ఉండడం విశేషం. రాయల్టీల చెల్లింపుల వల్ల మార్జిన్లు 7% తగ్గుతున్నాయి.