
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ 2018లో భారత మార్కెట్లో దాదాపు రూ. 650 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఏడాది భారత్‌లోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్స్‌లో ఒకటిగా నిలవాలని నిర్దేశించుకున్నామని, ఇందులో భాగంగా గతేడాది పెట్టిన పెట్టుబడులతో పోలిస్తే 30 శాతం అధికంగా ఇన్వెస్ట్ చేయనున్నామని జియోనీ ఇండియా నేషనల్ సేల్స్ డైరెక్టర్ అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. జియోనీ గతేడాది మార్కెటింగ్‌పై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రూ. 8,000– రూ. 20,000 స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 20 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు అలోక్ వివరించారు.
కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కొత్త ఫోన్స్‌లో ఎఫ్205 (ధర రూ. 8,999), ఎస్11 (రేటు రూ. 13,999) ఉన్నాయి. 42,000 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్స్‌ను మరింత పటిష్టం చేయనున్నట్లు, సర్వీస్ సెంటర్స్ సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి 477 నుంచి 650కి పెంచుకోనున్నట్లు అలోక్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment