సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి నష్టాల్లో కొనసాగుతోంది. ఆరంభంలోనే డాలరుమారకంలో 71 రూపాయల స్థాయికి పడిపోయింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో పెట్టుబడిదారులు డాలరువైపు మొగ్గు చూపడంతో బుధవారం డాలర్‌తో 14 పైసలు నష్టపోయి 71.01 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. మంగళవారం 70.87 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ముడి చమురు బారెల్‌కు (ఫ్యూచర్స్) 0.25 శాతం తగ్గి 64.33 డాలర్లకు పడిపోగా, డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 97.34 వద్దకు చేరుకుంది.
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకు చైనా దిగుమతులపై బిలియన్ డాలర్ల సుంకాలు అమల్లో ఉంటాయని నివేదికలు వెలువడిన తరువాత ఇతర ఆసియా కరెన్సీలతో పాటు రూపాయి బలహీనపడింది.మరోవైపు బుధవారం సంతకం చేయబోయే చైనాతో వాణిజ్య ఒప్పందంలో చైనా వస్తువులపై విధించిన సుంకాలను వెనక్కి తీసుకునే ఒప్పందం లేదని అమెరికా అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముడి చమురు ధరల క్షీణత అమెరికన్ కరెన్సీని బలహీనపరచడం దేశీయ కరెన్సీకి కొంతవరకు మద్దతు ఇస్తుండగా, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు, విదేశీ ఫండ్ ప్రవాహాలు రూపాయిపై ప్రభావం చూపుతున్నాయని ట్రేడర్లు భావిస్తున్నారు. వ్యాపారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment