
సాక్షి, ముంబై: కరెన్సీ మార్కెట్‌లో దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం కొద్దిగా పుంజుకున్న రుపీ బుధవారం మరోసారి ఢమాల్ అంది. ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకుండా.. మరింత దిగజారి తాజాగా మరోసారి మూడునెలల కనిష్టాన్ని నమోదు చేసింది.
అంతేకాదు డాలర్ మారకంలో రూపాయి 67 మార్క్‌కు పడిపోవడానికి దగ్గరలో ఉంది. 0.41పైసలు క్షీణించి 66.80 వద్దకు చేరింది. దిగుమతిదారుల నుంచి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడింది. ద్రవ్యలోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి ఇప్పటికే కొనసాగుతోందని డీలర్లు చెప్పారు. ఎఫ్ఐఐ అమ్మకాలు కొనసాగడంతో, బలహీనమైన స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment