
ముంబై: జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి మళ్లీ పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ఏకంగా 21 పైసలు ఎగిసి 68.84 వద్ద క్లోజయ్యింది. కరెన్సీ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ పరోక్షంగా జోక్యం చేసుకుని ఉండొచ్చని, రికవరీకి ఇదే కారణం కావొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
అటు కొన్ని విదేశీ బ్యాంకులు డాలర్లను షార్ట్ సెల్లింగ్ చేయడం కూడా ఇందుకు దోహదపడి ఉండొచ్చని పేర్కొన్నాయి. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ క్రితం రోజు నాటి రికార్డు కనిష్ట స్థాయి 69.05తో పోలిస్తే కొంత మెరుగ్గా 69.01 వద్ద ప్రారంభమైంది. అంతలోనే అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో లైఫ్‌టైమ్ కనిష్ట స్థాయి 69.13కి పడిపోయింది. ఆర్‌బీఐ జోక్యం వార్తలు, తదితర అంశాల ఊతంతో చివరికి 68.84 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment