రెండేళ్ల గరిష్ఠానికి రూపాయి | Rupee Surges To Two-Year High Against Dollar On Wednesday | Sakshi
Sakshi News home page

రెండేళ్ల గరిష్ఠానికి రూపాయి

Published Thu, Aug 3 2017 12:50 AM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

రెండేళ్ల గరిష్ఠానికి రూపాయి

రెండేళ్ల గరిష్ఠానికి రూపాయి

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు తగ్గించడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ రెండేళ్ల గరిష్టానికి ఎగిసింది. బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 37 పైసలు బలపడి 63.70 వద్ద ముగిసింది.

2015 జులై 22 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అప్పట్లో రూపాయి 63.58 వద్ద క్లోజయ్యింది. ఇక ఒకే రోజున 37 పైసలు పెరగడం ఈ ఏడాది ఇదే తొలిసారి. పది నెలల విరామం తర్వాత రెపో రేటు పావు శాతం తగ్గిన దరిమిలా సానుకూల పరిణామాలపై ఆశావహ అంచనాలు నెలకొనడంతో రూపాయి ర్యాలీకి ఊతం లభించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement