
28 పైసలు లాభపడ్డ రూపాయి
గత 3 ట్రేడింగ్ సెషన్లలో 48 పైసలు లాభం
ముంబై: రూపాయి వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ బలపడింది. విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండటంతో సోమవారం డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు లాభపడి 66.97 వద్ద ముగిసింది. ఇది మూడు వారాల గరిష్ట స్థాయి. ఫారెక్స్ మార్కెట్లో గత శుక్రవారం నాటి ముగింపు(67.25)తో పోల్చితే సోమవారం ట్రేడింగ్‌లో 66.95 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66.85 గరిష్ట స్థాయిని తాకి చివరకు 66.97 వద్ద ముగిసింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు బలహీనంగా ఉండటంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి లాభాలతో ప్రారంభమైందని వెరాసిటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమిత్ బ్రహ్మభట్ పేర్కొన్నారు. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 48 పైసలు(0.72 శాతం) లాభపడింది.