
సాక్షి, ముంబై: ఇరాన్-అమెరికా ఉద్రికత్తల నడుమ దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు. 71.82తో పోలిస్తే డాలరుమారకంలో మరోసారి 72 స్థాయికి పోయింది. ప్రస్తుతం 20 పైసలు పతనమై 72.02 వద్ద ఉంది. మరోవైపు అమెరికా-ఇరాన్ టెన్షన్స్ నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాక్‌లోని అమెరికి సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి అనంతరం అంతర్జాతీయ బెంచ్‌మార్క్ క్రూడ్ ఆయిల్ ధర ఒకదశలో 70డాలర్లకు చేరింది.
అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది.అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, జీడీపీపై ప్రభుత్వ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. ఆరంభంలోనే 350 పాయింట్లకు పైగా సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కీలకమైన 12వేల స్థాయిని కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 234 పాయింట్లు పతనమై 40609 వద్ద, నిఫ్టీ 86 పాయింట్లునష్టంతో 11965 వద్ద కొనసాగుతోంది. ప్రదానంగా బ్యాంకింగ్,ఆటో, మెటల్ షేర్లలోఅమ్మకాల ఒత్తిడినెలకింది. మరోవైపు రూపాయి బలహీనతతో ఐటీ షేర్లు లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment