
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోకి జారుకుంది. బుధవారం రూపాయి ఒక నెలలో కనిష్ట స్థాయికి బలహీనపడింది. యుఎస్ బాండ్ దిగుబడి పెరిగిన నేపథ్యంలో డాలర్ లాభపడుతోంది. దీంతో ఫారెక్స్ ట్రేడర్లు రూపాయిలో అమ్మకాలకు దిగారు. దీంతో డాలర్ మారకంపోలిస్తే మన కరెన్సీ 73.52 ట్రేడింగ్‌ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు 73.38 తో పోలిస్తే 73.59 స్థాయి వద్ద రూపాయి మార్చి1 నాటికి స్థాయిని టచ్ చేసింది. అమెరికా బాండ్ దిగుబడి పుంజుకున్న నేపథ్యంలో రూపాయ విలువ నెల కనిష్టానికి పడిపోయింది. భవిష్యత్తులో మరింత పడిపోవచ్చని అంచనా.
ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా డాలర్లకు డిమాండ్ బావుందని వ్యాపారులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో పతనమైన స్థాయికి పతనంకానుందని స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్‌సిలో పారుల్ మిట్టల్ సిన్హా అంచనా వేశారు. 76.5 వద్ద ఏడాది కనిష్టానికి చేరనుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు రూపాయి విలువను ప్రభావితం చేయనున్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా బలహీనంగా కొనసాగుతున్నాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌ప్రస్తుతం 455 పాయింట్లు క్షీణించి 49698 వద్ద 49700 స్థాయిని కోల్పోయింది. అలాగే నిఫ్టీ కూడా 103 పాయింట్ల నష్టంతో 14741 వద్ద ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment