శామ్‌సంగ్ మరో స్మార్ట్‌వాచ్.. ‘గేర్2
బార్సిలోనా(స్పెయిన్): శామ్‌సంగ్ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌వాచ్, ‘గేర్2’ను ఆవిష్కరించింది. ఇక్కడ ఈ నెల 24 నుంచి 27 వరకూ జరిగే మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రదర్శించనుంది.
వాచ్‌తో పాటు శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇది గెలాక్సీ ‘ఎస్5’ కావచ్చని అంచనాలున్నాయి. ఇక గేర్ 2లో స్పోర్ట్స్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్, హార్ట్ రేట్ మానిటర్ తదితర ఫీచర్లున్నాయి. టైజెన్ ఓఎస్‌పై పనిచేసే ఈ గేర్ 2లో రెండు మోడళ్లు-గేర్ 2, గేర్ 2 నియో(దీంట్లో కెమెరా ఫీచర్ లేదు)లను శామ్‌సంగ్ అందిస్తోంది.
ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ గేర్2 స్మార్ట్‌వాచ్‌లో 1.63 అంగుళాల స్క్రీన్, 2.0 మెగా పిక్సెల్ కెమెరా, హార్ట్‌రేట్ సెన్సర్, పెడోమీటర్, బ్లూ టూత్ హెడ్‌ఫోన్‌గా పనిచేసే ఆడియో, టెక్స్‌ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ వచ్చాయని తెలిపే అలర్ట్ సిస్టమ్ తదితర ఫీచర్లున్నాయి. టీవీ, తదితర డివైస్‌లకు రిమోట్ కంట్రోల్‌గా కూడా స్మార్ట్ వాచ్ పనిచేస్తుందని శామ్‌సంగ్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన ‘గేర్’ స్మార్ట్‌వాచ్ ఏమంత ఫ్యాషన్‌గా లేదని విమర్శలు వచ్చాయి.
దీంతో మరిన్ని మార్పు చేర్పులతో గేర్2ను శామ్‌సంగ్ తెస్తోంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట లక్ష్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌లను కంపెనీ అందిస్తోందని నిపుణులంటున్నారు.