
అసోచామ్ కొత్త ప్రెసిడెంట్ సందీప్ జాజోడియా
న్యూఢిల్లీ: అసోచామ్ కొత్త ప్రెసిడెంట్‌గా సందీప్ జాజోడియా నియమితులయ్యారు. ఈయన మోనెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అలాగే వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న బాలక్రిషన్ గోయెంకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ చైర్మన్‌గా ఉన్న కిరణ్ కుమార్ గ్రంధి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికయ్యారు. ‘అసోచామ్ జాతీయంగా, అంతర్జాతీయంగా తన క్రియాశీలక పాత్ర కొనసాగిస్తుంది. ఎంతో క్లిష్టమైన, సంబంధిత అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా భారతీయ కంపెనీలను స్వయం సమృద్ధి దిశగా పయనింపజేయడానికి ప్రయత్నిస్తాం’ అని జాజోడియా తెలిపారు. కాగా శ్రేయీ ఇన్‌ఫ్రా వైస్ చైర్మన్ సునీల్ కనోరియా నుంచి జాజోడియా ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు.