
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్థిర డిపాజిట్ రేట్లు వివిధ మెచ్యూరిటీలపై 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగి 6.80 శాతానికి చేరాయి. కోటి రూపాయల లోపు వివిధ డిపాజిట్లపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగిన ఈ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు ఈ నెల ప్రారంభంలోనే డిపాజిట్ రేట్లను పెంచాయి.
పెంపు వివరాల్లోకి వెళితే...
∙ఏడాది– రెండేళ్ల మధ్య డిపాజిట్ రేటు 6.70 శాతం నుంచి 6.80 శాతానికి పెరిగింది. సీనియర్ సిటిజన్స్ విషయంలో ఈ రేటు 7.20 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది.
∙రెండు–మూడేళ్ల రేటు 6.75 శాతం నుంచి 6.80 శాతాని చేరింది. ఈ విభాగంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే స్థిర డిపాజిట్ రేటు 7.25 శాతం నుంచి 7.30 శాతానికి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment