
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ ఒడిదుడుకులమధ్య చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు క్షీణించి 36,644 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 10,848 వద్ద స్థిరపడింది. తొలుత ఉత్సాహం, డీలీ, మళ్లీ పుంజుకోవడం, మళ్లీ లాభాలు రోజంతా ఇదే ట్రెండ్‌కొనసాగింది. ఈ ఊగిసలాటల మధ్య చివరికి అటూఇటూ ముగిసాయి. ప్రధానంగా మెటల్, ఆటో, మీడియా, ఫార్మా రంగాలు లాభడగా రియల్టీ, బ్యాంక్స్ నష్టపోయాయి. టాటామోటార్స్, కోల్ ఇండియా, ఓన్‌జీసీ, యస్‌బ్యాంకు, ఎన్‌టీపీసీ,మారుతి సుజుకి, ఎంఅండ్‌ఎం, వేదాంతా టాప్ గెయినర్స్‌గానూ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా బుల్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ మహీంద్ర, టెక్ మహీంద్ర, ఆసియన్ పెయింట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment