ముంబై : స్టాక్ మార్కెట్లలో అప్‌ట్రెండ్ కొనసాగుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దూకుడు మీదున్న స్టాక్ మార్కెట్లు సోమవారం అదే జోరు కొనసాగించాయి. సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 39,890 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 12వేల పాయింట్ల దిగువన 11,970 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఆటోమొబైల్ మినహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. మే నెలలో వాహన విక్రయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment