సాక్షి, ముంబయి : ఆసియా మార్కెట్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు సానుకూల జోష్‌తో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్ధాన్ యూనిలివర్ సహా పలు కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటం, రూపాయి బలహీనం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి.
ఇక ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడుతుండగా..టాటా మోటార్స్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ర్టీస్, భారతి ఎయిర్‌టెల్ నష్టపోతున్నాయి. మరోవైపు హెచ్‌యూఎల్, అదానీ పవర్, మైండ్ ట్రీ, జీ ఎంటర్‌టెన్‌మెంట్, డీసీబీ బ్యాంక్, టాటా స్పాంజ్ త్రైమాసిక ఫలితాలను నేడు వెల్లడించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment