ముంబై : సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు మరికాసేపట్లో వెలువడనుండగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్ 41,000 పాయింట్ల దిగువన ట్రేడవుతోంది. ఆటో, మెటల్ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఫార్మా, రియల్ ఎస్టేట్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద సెన్సెక్స్ 300 పాయింట్ల పైగా నష్టంతో 40,795 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,060 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment