GDP Data
-
పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్ మూడు రోజులే జరిగే ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్, ఆర్థి క సంవత్సరం గడువు ముగింపు అంశాలు ట్రేడింగ్ ప్రభావితం చేయచ్చని పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముఖ్యంగా అమెరికా జీడీపీ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని అంచనా. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. హోలీ సందర్భంగా నేడు (సోమవారం), గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులు జరగుతుంది. అయితే ఈ రెండు సెలవు రోజుల్లో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘ఈ వారం ఆర్థిక సంవత్సరం (2023–24) ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్లు, దేశీయ సంస్థాగత సంస్థలు లాభాలు లేదా నష్టాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మూడు రోజులే కావడంతో ఎక్సే్చంజీల్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా ఉండొచ్చు. అయితే టి+0 సెంటిల్మెంట్ ప్రారంభం, ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు నేపథ్యంలో సూచీల ఊగిసలాట ఉండొచ్చు. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,200 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. దిగువ స్థాయిలో 21,700 తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో అమ్మకాలతో చతికిలపడిన స్టాక్ సూచీలు ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధాన వైఖరి, సంస్థాగత ఇన్వెస్టర్ల బలమైన కొనుగోళ్లతో కారణంగా ద్వితీయార్థంలో బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 74 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లు రాణించిన రికవరీకి తమ వంతు సాయం చేశాయి. ప్రయోగాత్మకంగా టి+0 సెటిల్మెంట్ అమలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచనల మేరకు ట్రేడింగ్ జరిగిన రోజే సెటిల్మెంట్(టి+0) విధానాన్ని ఎక్సే్చంజీలు గురువారం(మార్చి 28) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నాయి. అన్ని షేర్లకు టి+0 విధానం అమలు చేయడానికి ముందుగా 25 షేర్లు, పరిమిత బ్రోకర్లకు మాత్రమే మొదలుపెట్టనున్నారు. ప్రయోగ పనితీరు ఫలితాలను బట్టి టి+0 అమలు తేదీపై సెబీ ఒక నిర్ణయానికి వస్తుంది. తక్షణ సెటిల్మెంట్ వల్ల మార్కెట్లో ద్రవ్యలభ్యత పెరుగుతుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్ల సామర్థ్యం, పారదర్శకత మెరుగవుతుంది. గురువారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ఈ గురువారం(మార్చి 28న) నిఫ్టీ సూచీకి చెందిన ఫిబ్రవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు బ్యాంక్ ఆప్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశ వివ రాలు, అమెరికా గృహ అమ్మకాలు సోమవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసెస్ సెంటిమెట్, వినియోగదారుల వి శ్వాస గణాంకాలు బుధవారం వెల్లడి కాను న్నాయి. బ్రిటన్ క్యూ4 జీడీపీ వృద్ధి, కరెంట్ ఖాతా, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి డేటా గురువారం విడుదల అవుతుంది. చైనా కరెంట్ ఖాతా, జపాన్ నిరుద్యోగ రేటు, అమెరికా పీసీఈ ప్రైజ్ ఇండెక్స్ డేటా వివరాలు శుక్రవారం వెల్లడి అవుతాయి. విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి భారతీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వర కు (మార్చి 22 నాటికి) రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సాను కూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు ఎఫ్ఐఐలను ఆక ట్టుకుంటున్నాయి. ‘‘భారత జీడీపీ వృద్ధి, ఆర్బీ ఐ అంచనాలు, వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో కీలక వడ్డీ రేట్లు 20–50 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చనే నిపుణుల అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా మేనేజర్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్ల భారీ పెట్టుబడుల తర్వాత గత నెల ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల షేర్లను విక్ర యించారు. ఈ ఏడాదిలో ఇప్పటివర కు ఎఫ్‌పీఐలు రూ. 13,893 కోట్లు ఈక్విటీల్లోకి, రూ. 55,480 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. -
4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్?
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) మైలురాయిని అధిగమించేసిందన్న వార్తలు ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ .. కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. భారత్ 4 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు చూపుతూ ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అయ్యింది. దీన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి పోర్టల్‌లో వివిధ దేశాల జీడీపీ గణాంకాల లైవ్ ఫీడ్ నుంచి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అటుపైన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ, మహారాష్ట్ర డిప్యుటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. అయితే, వార్తలపై అధికారిక స్పందన వెలువడలేదు. -
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికి కోవిడ్–19 ముందస్తు స్థాయికి మెరుగుపడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 8%లోపే ఉంటుందన్నది కూడా తమ అంచనా అని ఒక వార్తా సంస్థతో పేర్కొన్నారు. భారత్ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ)తన వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం. బ్యాంకింగ్ సేవల విస్తరణ జరగాలి బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీడీపీలో ప్రైవేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగానే ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి 100 శాతానికిపైగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడుతూ, రసాయనాల రహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తోందన్నారు. ఈ దిశలో ముందడుగు వేయడానికి తన వంతు కృషి చేస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. అలాగే పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగంలో పోటీతత్వం, అలాగే రైతుల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం స్వీయ నియంత్రణ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి ఒక స్వీయ–నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్వతంత్ర బోర్డుకు అప్పగించాలని సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడేలా, మైనర్లను దూరంగా ఉంచేలా ఆంక్షలు ఉండాలని ఒక ముసాయిదా నివేదికలో పేర్కొంది. గవర్నెన్స్, చట్టాలు, పాలన తదితర రంగాల్లో పేరొందిన వ్యక్తులను స్వతంత్ర పర్యవేక్షణ బోర్డులో నియమించాలని అందులో సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలి నివేదిక ప్రకారం ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య 2016 జూన్‌తో పోల్చితే, 2019 డిసెంబర్ నాటికి 212 శాతం వృద్ధి చెంది 9 కోట్ల మందికి పెరిగింది. 2023 నాటికి దీని ద్వారా 150 కోట్ల మేర ఆన్లైన్ లావాదేవీలు జరగొచ్చని అంచనా. -
జీడీపీ గణాంకాలను దలాల్ స్ట్రీట్ డిస్కౌంట్ చేసుకుంది
దలాల్ స్ట్రీట్ జీడీపీ గణాంకాలను డిస్కౌంట్ చేసుకుందని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా అంటున్నారు. ఈక్విటీ మార్కెట్ల కోణం నుంచి జీడీపీ గణాంకాలను పరిశీలిస్తే పూర్తిగా నెమ్మదించాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ అసాధారణ పరిస్థితులను ఎదుర్కోంటున్న నేపథ్యంలో జీడీపీ గణాంకాల అవుట్‌లుక్‌ను పరిగణలోకి తీసుకోవడం మంచిది కాదన్నారు. స్టాక్ మార్కెట్ జీడీపీ గణాంకాలకు లోబడి ట్రేడవదని, కేవలం ఈవెంట్స్‌కు మాత్రమే ప్రభావితం అవుతుందన్నారు. స్టాక్ మార్కెట్‌ను అంచనా వేయడానికి వాస్తవికతను పరిగణాలోకి తీసుకోవాలని ఉమేష్ మెహతా చెప్పారు. తొందర్లోనే నిఫ్టీ 10వేల స్థాయిని పరీక్షించే అవకాశం కొద్ది రోజుల్లోనే నిఫ్టీ ఇండెక్స్ 10వేల స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని మెహతా అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో మే చివరివారం నుంచి నెలకొన్న ఆశావహన వైఖరి, బుల్లిష్ ధోరణిలు నిఫ్టీని 10వేలకు స్థాయిని పరీక్షింప చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఐతే 9900-10000 శ్రేణిలో నిఫ్టీ ఏర్పరుచుకున్న కీలక నిరోధాన్ని చేధించడటం కొంత కష్టతరమని మెహతా అంటున్నారు. షార్ట్ కవరింగ్ కారణంగానే బ్యాంక్ షేర్ల ర్యాలీ కేవలం షార్ట్ కవరింగ్ కారణంగానే గత 3రోజుల నుంచి బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీగా కొనుగోళ్లు నెలకొన్నాయని మెహతా అన్నారు. భారత ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ఐఐలు గత 3నెలలుగా నికర అమ్మకందారులుగా ఉన్నారు. అయితే మే 28న ఎక్స్పైజరీ సందర్భంగా వారు షార్ట్ కవరింగ్ చేయడంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో మూమెంటం ఊపందుకుంది. అన్ని రకాలపై రుణాలపై 3నెలల మారిటోరియం, నిరర్ధక ఆస్తుల సైకిల్, పెరుగుతున్న నిరర్ధక రుణాలతో రానున్న రోజుల్లో బ్యాంకింగ్ షేర్ల తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోనే అవకాశం ఉందని మెహతా అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదికి బ్యాంకింగ్ రంగ షేర్లకు కంటే కన్జూ్యమర్ షేర్ల కొనుగోలు ఉత్తమని అయన అభిప్రాయపడ్డారు. భారత్ లాక్డౌన్ కొనసాగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని మెహతా అంటున్నారు. -
రియల్టీ రంగానికి 2019లో నిరాశే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించ డం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వం టి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగం లో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం 4 శాతం వృద్ధితో 2,58,410 యూనిట్లకు చేరాయి. ఇందులోనూ అందుబాటు గృహాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. అఫడబు ల్ హౌసింగ్లకు పలు పన్ను రాయితీలను కల్పించ డమే ఇందుకు కారణం. తొలిసారి గృహ కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల పన్ను రాయితీని అందిస్తుంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అందుబాటులో ఉంటుంది. రెడీ టు మూవ్ గృహాలకే డిమాండ్.. రియల్ ఎస్టేట్ రంగం పనితీరు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల క్రితం నాటికి క్షీణించి 4.5 శాతానికి చేరింది. ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో డిమాండ్ కనిపించింది.. కానీ, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ తిరోగమన బాట పట్టిందని చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా 6 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్ల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. లిస్టెడ్, బ్రాండెడ్ నిర్మాణ సంస్థలు మాత్రం గృహ విక్రయాల్లో కాసింత ఉపశమనంలో ఉన్నాయి. ఈ ఏడాది గృహ విభాగానికి కలిసొచ్చిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)ను ఏర్పాటు చేయడమే. -
ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్ది ఊహించినదానికంటే కనిష్టానికి పడిపోయింది. ప్రభుత్వం తాజాగా శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో క్యు2లో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్టం. ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్ డిమాండ్ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు..ఎకానమీపై ప్రభావం చూపినట్టు నిపుణులు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధి మరోసారి 5 శాతం కంటే కిందికి పడిపోయింది. గతంలో 2013 జనవరి- మార్చిలో జీడీపీ 4.3 శాతంగా నమోదయింది. గత ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వృద్ధిలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని,పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీడీ ఆరున్నర సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 4.5 శాతం వృద్ధిని సాధించినట్లు నేషనల్ స్టాటిస్టికల్ విభాగం శుక్రవారం వెల్లడించింది. మరోవైపు దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్ పోల్ ఇప్పటికే అంచనావేసిన సంగతి తెలిసిందే. ఇది 4.7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేయగా, మరింత కిందికి దిగజారడం గమనార్హం. -
కీలక డేటా : స్టాక్ మార్కెట్లు కుదేలు..
ముంబై : సెప్టెంబర్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు మరికాసేపట్లో వెలువడనుండగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 41,000 పాయింట్ల దిగువన ట్రేడవుతోంది. ఆటో, మెటల్ సహా పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఫార్మా, రియల్ ఎస్టేట్ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద సెన్సెక్స్ 300 పాయింట్ల పైగా నష్టంతో 40,795 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12,060 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. -
ఇదీ మోదీ తరహా ‘ధర్మం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యపై ‘నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్’ నిర్వహించిన అధ్యయన వివరాలను వెల్లడించవద్దంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హుకుం జారీ చేయడాన్ని నిరసిస్తూ ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ నుంచి గత వారంలో ఇద్దరు స్వతంత్య్ర సభ్యులు రాజీనామా చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సభ్యులు మాత్రమే కమిషన్‌లో కొనసాగుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వారించినా సర్వే నివేదికలోని అంశాలను ‘బిజినస్ స్టాండర్ట్’ పత్రిక వెతికి పట్టుకొని బయట పెట్టడంతో అన్ని పత్రికలు ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. దేశంలో 2011–12 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య 2.2 శాతం ఉండగా, 2017–2018 సంవత్సరంలో అది 6.1 శాతానికి చేరుకుందని, ఇది గడిచిన 45 ఏళ్లలో ఇదే గరిష్టమని వెల్లడించడమే మోదీ ప్రభుత్వం ఆ నివేదిక విడుదలను అడ్డుకోవడానికి కారణం. ఇలాంటి నివేదికలను ఇలా అడ్డుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం పనితీరు బాగా లేదని సూచించే అధికార గణాంకాలను, నివేదికలను మోదీ ప్రభుత్వం మొదటి నుంచి అడ్డుకుంటోంది. 2017లో ‘ఉద్యోగ నియామకాలు–నిరుద్యోగం’ అంశంపై నిర్వహించాల్సిన జాతీయ సర్వేను రద్దు చేసింది. దేశంలోని ఉద్యోగ అవకాశాలపై ‘లేబర్ బ్యూరో’ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సర్వేలను వద్దన్నది. ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తానంటూ 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమవడం వల్లనే మోదీ ప్రభుత్వం ఇలాంటి నివేదికలను బయటకు రానీయడం లేదన్నది సుస్పష్టం. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుపై ఇదే ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ ఇచ్చిన నివేదికను కూడా మోదీ ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఉన్న జీడీపీ వృద్ధి రేటు నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో పడిపోయినట్లు ఆ గణాంకాలు సూచించడమే ఆ నివేదికను తిరస్కరించడానికి కారణం. నివేదిక విడుదలకు కేంద్రం అనుమతించకపోయినా ఇప్పటి ‘నిరుద్యోగంపై నివేదిక’లోని అంశాల్లాగే అవి బయటకు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం హయాంలో వరుసగా జీడీపీ వృద్ధి రేటు పడిపోతున్నట్లు గణాంకాలు తెలియజేస్తుండడంతో అసలు లెక్కలోనే తప్పుందని, కొత్త ప్రాతిపదికన లెక్కలు చెప్పాలని మోదీ ప్రభుత్వం 2017లో ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రాతిపదికన జీడీపీ వృద్ధిని అంచనా వేసినప్పుడు అదే పద్ధతిన అంతకు ఐదేళ్ల ముందున్న వృద్ధి రేటు కూడా అంచనా వేయడం తప్పనిసరని ఆర్థిక నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో మోదీ హయాంలో వృద్ధి రేటును కొత్త పద్ధతిన లెక్కించిన ‘నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్’ వృద్ధి రేటును 5.7 శాతంగా పేర్కొంది. అదే పద్ధతిన 2011–2012 సంవత్సరంలోని వృద్ధి రేటును అంచనా వేయగా 7.1 శాతంగా తేలింది. ఈ కారణంగా నివేదిక విడుదలను మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఈ అంకెలతో విభేదించిన ‘నీతి ఆయోగ్ (ప్రధాని సలహా మండలి)’ పాత లెక్కల జోలికి వెళ్లకుండా మోదీ ప్రభుత్వం 7.2 శాతం వృద్ధి రేటును సాధించిందని అసాధారణ నివేదికను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్నే ప్రచారం చేసుకుంటోంది. ప్రతి ఏటా విడుదల చేసే ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ నివేదికను కూడా ఈ సారి మోదీ ప్రభుత్వం విడుదల చేయకపోవడం గమనార్హం. 1986లో ఏర్పాటయిన ఈ బ్యూరో దేశంలో జరుగుతున్న వివిధ నేరాల డేటాను సమీక్షించి ఏట వార్షిక నివేదికను విడుదల చేస్తోంది. 2016లో జరిగిన నేరాలకు సంబంధించిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2017, నవంబర్ 30వ తేదీన క్రైమ్ నివేదికను విడుదల చేశారు. 2017లో జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికను 2018 నవంబర్‌లో విడుదల చేయాల్సిన కేంద్ర హోం శాఖ ఇంతవరకు విడుదల చేయలేదు. దీని వెనకనున్న పరమార్థం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సంస్థల ప్రతిపత్తిని, వాటి విధులను గౌరవించడం పాలకపక్షం ధర్మం! -
జీడీపీ భయాలు : మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచికోలుకుని 100పాయింట్లకుపైగా పుంజుకున్న కీలక సూచీలు , చివరకు ప్రధాన మద్దతు స్తాయిలను నిలబెట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు క్షీణించి 38,645 వద్ద,నిఫ్టీ 4 పాయింట్లు లాభంతో 11,680 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆయిల్, మెటల్ సెక్టార్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఫార్మా రంగాలు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, టెక్ మహీంద్ర, భారతి ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్ బ్యాంక్ ,వేదాంత, ఐసీఐసీఐ, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, నష్టాలు మార్కెట్లు ప్రభావితం చేశాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రుపీ తొలిసారి డాలరు మారకంలో 71 రూపాయల స్థాయికి పతనమైంది. -
మోదీ ప్రభుత్వానికి హోలీ గిఫ్ట్
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హోలీ కానుక అందింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు, పీఎన్బీలో చోటుచేసుకున్న భారీ కుంభకోణంతో సతమతమవుతున్న ప్రభుత్వానికి జీడీపీ డేటా గుడ్‌న్యూస్ అందించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ జీడీపీ 7.2 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. తయారీ, ఖర్చులు పెరుగడంతో, జీడీపీ పెరిగినట్టు తెలిసింది. దీంతో ప్రధాని ప్రవేశపెట్టిన రెండు అతిపెద్ద షాక్‌ల నుంచి దేశం తేరుకుంటుందని తెలిసింది. 2016 నవంబర్‌లో ప్రధాని నోట్ బ్యాన్‌ను ప్రవేశపెట్టగా.. 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు దేశీయ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావమే చూపాయి. ప్రస్తుతం వీటి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టు నేడు వెల్లడైన జీడీపీ డేటాలో తెలిసింది. ఈ డేటా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. కాగ, 2017-18 మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతం ఉండగా.. ఆ ముందటి క్వార్టర్లో 6.1 శాతంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటుతో పాటు ఎనిమిది కోర్ ఇన్ఫ్రా రంగాల డేటాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది 3.4 శాతంగా ఉన్న ఈ రంగాల వృద్ధి రేటు, ప్రస్తుతం 6.7 శాతానికి పెరిగినట్టు తెలిసింది. ఎక్కువ మొత్తంలో వ్యయాలతో మోదీ ప్రభుత్వం దేశీయ ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద 32.36 బిలియన్ డాలర్లను(రూ.2,10,971కోట్లకు పైగా) ప్రకటించింది. అదేవిధంగా 2019లో ఎన్నికలు ఉండటంతో వృద్ధికి బూస్ట్‌నిచ్చే మౌలిక సదుపాయాలు, సంక్షేమ ప్రాజెక్టులకు భారీ ఎత్తున్న ఖర్చు చేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు సైతం పెరిగింది. జీడీపీలో ఇది 3.5 శాతంగా ఉంది. గత నవంబర్‌లో దేశీయ పెట్టుబడుల గ్రేడ్ రేటింగ్‌ను కూడా మూడీస్ 14 ఏళ్లలో తొలిసారి అప్‌గ్రేడ్ చేసింది. వరల్డ్ బ్యాంకు డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2018లో తొలిసారి భారత్ 30 స్థానాలు జంప్ చేసి టాప్-100లో చోటు దక్కించుకుంది. -
గణాంకాల ప్రభావం: మార్కెట్లు ఫ్లాట్
సాక్షి, ముంబై : జీడీపీ డేటా ఎఫెక్ట్‌తో సెప్టెంబర్ సిరీస్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 58.21 పాయింట్ల లాభంలో 31,788 వద్ద, నిఫ్టీ16 పాయింట్ల లాభంలో 9933 వద్ద కొనసాగుతోంది. నిన్న విడుదలైన గణాంకాల్లో జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయినట్టు తెలిసింది. దీంతో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనట్లు నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో కొనసాగుతున్నాయి. ఆగస్టు నెల ఆటో సేల్స్ డేటా విడుదలైన క్రమంలో బజాజ్ ఆటో 2 శాతం లాభం పొందింది. డాక్టర్ రెడ్డీస్ ఏకంగా 6.5 శాతం పైకి జంప్ చేసింది. వివస్తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడం ఈ షేర్లకు బూస్ట్‌నిచ్చింది. ఇదే సమయంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా స్వల్ప నష్టంలో ప్రారంభమైంది. ప్రస్తుతం 10 పైసలు బలపడి 63.89 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 188 రూపాయల లాభంలో 29,743 రూపాయలుగా ట్రేడవుతున్నాయి. -
స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు
నష్టంతో ముగిసిన మార్కెట్ ముంబై: నిరుత్సాహకర జీడీపీ డేటాకు స్పందనగా ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించడంతో గురువారం స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై, చివరకు కొద్దిపాటి నష్టాలతో ముగిసాయి. 31,213–31,062 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 8.21 పాయింట్ల నష్టంతో 31,138 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదేబాటలో 9,634–9,589 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన గణాంకాల ప్రకారం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.1 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ డేటా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని, దాంతో రోజంతా సూచీలు స్వల్పశ్రేణిలో కదిలాయని, అయితే వచ్చేనెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో మార్కెట్ నష్టాలు తక్కువగా వున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ డౌన్... వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.58 శాతం నష్టపోయింది. కాగా ప్రధాన సూచీలు నీరసంగా ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు జోరుగా పెరగడంతో ఈ సూచీలు మంచి లాభంతో ముగిసాయి. -
జీడీపీ డేటా: నష్టాల్లో మార్కెట్లు
రికార్డుల జోరుతో పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ చివరికి స్వల్పనష్టాల్లో ముగిశాయి. బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 13.60 పాయింట్ల నష్టంలో 31,145 వద్ద, నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంలో 9,621 వద్ద క్లోజయ్యాయి. మహింద్రా అండ్ మహింద్రా, లుపిన్, ఆల్ట్రాటెక్ సిమెంట్ రెండు సూచీల్లో లాభాల్లో పైకి ఎగియగా.. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదంత, భారతి ఇన్ ఫ్రాటెల్ ఎక్కువగా నష్టపోయాయి. క్యూ4 స్థూల దేశీయోత్పత్తి డేటాను ప్రభుత్వం నేడే ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ట్రేడింగ్ వరకు రికార్డు స్థాయిలను నమోదుచేసిన మార్కెట్ లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రారంభించారు. జీడీపీ డేటాతో పాటు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో మార్కెట్లు కిందకి పడిపోయాయి. సెన్సెక్స్ గరిష్టంగా 31,216.98ని, నిఫ్టీ 9636.55 స్థాయిలను తాకింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.52 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 25 రూపాయల నష్టపోయి 28,716గా ఉన్నాయి. -
జీడీపీ జోష్‌తో మార్కెట్లు డబుల్ సెంచరీ
ముంబై: జీడీపీ గణాంకాల జోష్‌తో దేశీయస్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంనుంచే పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు డబుల్ సెంచరీ సాధించి జోరుగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక పురోగతి అంచనాలను మించడంతో ప్రస్తుతం సెనెక్స్ 223 పాయింట్లు ఎగిసి 28,967 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 8939 వద్ద కొనసాగుతున్నాయి. దలాల్ స్ట్రీట్ ఊహించిన దానికంటే మూడవ త్రైమాసికంలో జీడీపీ గణాంకాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 8,950ని అధిగమించేందకు సిద్ధంగా ఉంది. క్యూ3లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7 శాతం వృద్ధి సాధించడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గత రెండు నెలల్లో (డిసెంబర్ మరియు జనవరి) లో రూ. 14,000 కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోళ్లు మార్కెట్‌కు ఊతమిచ్చాయంటున్నారు. మదుపర్ల కొనుగోళ్లతో దాదాపు అన్ని రంగాలూ లాభాల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లులాభాలకు తోడు రియల్టీ, మెటల్, బ్యాంక్ నిఫ్టీ కూడా లాభపడుతున్నాయి. ఇన్ఫ్రాటెల్, యాక్సిస్, హీరోమోటో, పవర్‌గ్రిడ్, హిందాల్కోలాభాల్లోనూ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐడియా, ఎంఅండ్ఎం, అంబుజా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. అటు పసిడి బులియన్ మార్కెట్లో వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా నే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.191 క్షీణించి రూ.29,375 వద్ద ఉంది. రూపాయి కూడా 0.16పైసలు నష్టపోయి రూ.66.85 వద్ద వుంది. -
జీడీపీ డేటా, గ్లోబల్ ట్రెండ్‌పై దృష్టి
ప్రభావిత అంశాలు * చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు * రుతుపవనాల గమనం * ఆటో కంపెనీల అమ్మకాల గణాంకాలు * రూపాయి కదలికలు ముంబై: త్వరలో విడుదలయ్యే జీడీపీ గణాంకాలు, అంతర్జాతీయ ట్రెండ్‌పై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే చివరిబ్యాచ్ త్రైమాసిక ఫలితాలు, రుతుపవనాల గమనం తదితర అంశాలు కూడా దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారన్నారు. 2016 జనవరి-మార్చి త్రైమాసికానికి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఈ మంగళవారం వెలువడతాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తీరుతెన్నులు, ద్రవ్యలోటు పరిస్థితి, ఎనిమిది మూలధాన పరిశ్రమల డేటా కూడా ఈ వారం ప్రకటితమవుతాయని, ఇవన్నీ కూడా మార్కెట్‌ను హెచ్చుతగ్గులకు గురిచేస్తుందని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. జూన్ 1న వెలువడే ఆటోమొబైల్ కంపెనీల మే నెల అమ్మకాల డేటా ఆయా షేర్లను హెచ్చు తగ్గులకు లోనుచేస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మహింద్రా అరబిందో వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు ఈ వారమే వెలువడనున్నాయి. చివరిబ్యాచ్ కార్పొరేట్ ఫలితాలు, రూపాయి కదలికలు, ముడిచమురు ధర తదితరాల్ని ఇన్వెస్టర్లు రానున్నరోజుల్లో నిశితంగా గమనిస్తారని అంచనా. ఫెడ్ నిర్ణయం కీలకం... వడ్డీ రేట్లను క్రమేపీ పెంచుతామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఛైర్పర్సన్ జెనెట్ యెలెన్ గత శుక్రవారం ఇచ్చిన సంకేతాలకు ఈ సోమవారం ఇన్వెస్టర్ల స్పందనతో మార్కెట్ మొదలవుతుందని ట్రేడ్‌స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. గతవారం మార్కెట్... గతవారం సెన్సెక్స్ 1,351 పాయింట్ల పెరుగుదలతో 26,653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 407 పాయింట్లు ఎగిసి 8,157 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్చి 4 తర్వాత ఒకే వారంలో సూచీలు ఇంత అధికంగా పెరగడం ఇదే తొలిసారి. మే నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో రూ. 1,495 కోట్ల నికర పెట్టుబడులు చేశారు. అయితే ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూపాయి బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలతో డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐలు విక్రయాలు జరిపినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.