సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్ది ఊహించినదానికంటే కనిష్టానికి పడిపోయింది. ప్రభుత్వం తాజాగా శుక్రవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం క్యూ2లో క్యు2లో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్టం. ప్రైవేట్ పెట్టుబడులు బలహీనపడడం, కన్జూమర్ డిమాండ్ మందగమనం, అంతర్జాతీయ మాంద్య పరిస్థితులు..ఎకానమీపై ప్రభావం చూపినట్టు నిపుణులు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధి మరోసారి 5 శాతం కంటే కిందికి పడిపోయింది. గతంలో 2013 జనవరి- మార్చిలో జీడీపీ 4.3 శాతంగా నమోదయింది. గత ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 7.5 శాతంగా ఉంది.
ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్ దేశ ఆర్థిక వృద్ధిలో మందగమనం ఉంది కానీ మాంద్య పరిస్థితులు లేవని,పురోగతికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీడీ ఆరున్నర సంవత్సరాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 4.5 శాతం వృద్ధిని సాధించినట్లు నేషనల్ స్టాటిస్టికల్ విభాగం శుక్రవారం వెల్లడించింది. మరోవైపు దేశీయ ఎకానమీ గత ఆరేళ్లలో అత్యంత కనిష్ఠ వృద్ధిని సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేయవచ్చని రాయిటర్స్ పోల్ ఇప్పటికే అంచనావేసిన సంగతి తెలిసిందే. ఇది 4.7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేయగా, మరింత కిందికి దిగజారడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment