గణాంకాల ప్రభావం: మార్కెట్లు ఫ్లాట్
Published Fri, Sep 1 2017 9:43 AM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
సాక్షి, ముంబై : జీడీపీ డేటా ఎఫెక్ట్‌తో సెప్టెంబర్ సిరీస్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 58.21 పాయింట్ల లాభంలో 31,788 వద్ద, నిఫ్టీ16 పాయింట్ల లాభంలో 9933 వద్ద కొనసాగుతోంది. నిన్న విడుదలైన గణాంకాల్లో జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టానికి పడిపోయినట్టు తెలిసింది. దీంతో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనట్లు నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో కొనసాగుతున్నాయి. ఆగస్టు నెల ఆటో సేల్స్ డేటా విడుదలైన క్రమంలో బజాజ్ ఆటో 2 శాతం లాభం పొందింది.
డాక్టర్ రెడ్డీస్ ఏకంగా 6.5 శాతం పైకి జంప్ చేసింది. వివస్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడం ఈ షేర్లకు బూస్ట్‌నిచ్చింది. ఇదే సమయంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా స్వల్ప నష్టంలో ప్రారంభమైంది. ప్రస్తుతం 10 పైసలు బలపడి 63.89 వద్ద కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 188 రూపాయల లాభంలో 29,743 రూపాయలుగా ట్రేడవుతున్నాయి.
Advertisement