సాక్షి,ముంబై : ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలతో దలాల్‌స్ట్రీట్‌లో లాభాల పంటపడుతోంది. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ లాభాలతో 36వేల పాయింట్ల మైలురాయిని అధిగమించిన సెన్సెక్స్ ఒక దశలో 400పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 393 పాయింట్లు జంప్‌చేసి 36,109వద్ద, నిఫ్టీ సైతం 109 పాయింట్లు ఎగసి 10,837 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాభాలు సూచీల్లో జోష్ నింపుతున్నాయి.
మెటల్, ఎఫ్‌ఎంసీజీ దూకుడు
మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.3 శాతం చొప్పున ఎగశాయి. అయితే ఐటీ 0.3 శాతం నీరసించగా ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా రంగాలు 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. జీ,హిందాల్కో, వేదాంతా, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, ఇండస్‌ఇండ్ 3.6-2 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్ బ్యాంక్ మరోసారి 8 శాతం పతనమై.. అదే రేంజ్‌లో మళ్లీ పుంజుకుని 1 శాతం నష్టానికి పరిమితమైంది. ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, ఐవోసీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్ 2.2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.
రూపాయి బలం
అటు రూపాయి కూడా డాలరు మారకంలో 73 పైసలు ఎగిసి 70 స్థాయినుంచి 69.89 స్థాయికి పుంజుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment