సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలనుంచి తెప్పరిల్లాయి. భారీ పతనానికి చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హై జంప్ చేశాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ వసెంచరీ చేసింది. ప్రస్తుతం 578 పాయింట్లు జంప్‌చేసి 34,579కు చేరింది. నిఫ్టీ సైతం 183పాయింట్లు పురోగమించి 10,417వద్ద ట్రేడ్ అవుతోంది.
ఐటీతప్ప అన్ని రంగాలూ కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, హెచ్‌పీసీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, యస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐషర్, ఐవోసీ, అదానీ పోర్ట్స్, వేదాంతా 6-3 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.మరోవైపు నిన్నమార్కెట్ ముగిసిన అనంతరం ఫలితాలు ప్రకటించిన టీసీఎస్‌తోపాటు హెచ్‌సీఎల్ టెక్ స్వల్పంగా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో పుంజుకుంది. 74 స్థాయినుంచి పుంజుకుని 73.75 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment