స్నాప్‌డీల్‌కు మరో ఇద్దరు సీనియర్లు గుడ్‌బై | Snapdeal exit saga continues as two more senior executives resign | Sakshi
Sakshi News home page

స్నాప్‌డీల్‌కు మరో ఇద్దరు సీనియర్లు గుడ్‌బై

Published Sat, Aug 5 2017 1:48 PM | Last Updated on Mon, Oct 22 2018 5:17 PM

స్నాప్‌డీల్‌కు మరో ఇద్దరు  సీనియర్లు గుడ్‌బై - Sakshi

స్నాప్‌డీల్‌కు మరో ఇద్దరు సీనియర్లు గుడ్‌బై

న్యూఢిల్లీ: ఇ-కామర్‌ సంస్థ స్నాప్‌డీల్‌కు  రాజీనామాల బెడద తప్పడం లేదు. తాజాగా  ఇద్దరు  కీలక సీనియర్‌ అధికారులు సంస్థకు రాజీనామా చేశారు.  టాప్‌ మేనేజ్‌మెంట్‌ పై తీవ్ర మైన అసంతృప్తిని వ్యక్తం  చేస్తూ వారు సంస్థను వీడడం గమనార్హం.  
 
ప్రోగ్రామ్ మేనేజ్మెంట్  వైస్ ప్రెసిడెంట్  రాహుల్ గంజ్,  టెక్నాలజీ (డేటా ప్లాట్ఫాం) వైస్ ప్రెసిడెంట్ అరవింద్ హేడ తమ పదవులకు గుడ్‌ బై చెప్పారు.  ముఖ్యంగా ‘స్నాప్‌డీల్‌ 2.0’   కొత్త స్ట్రాటజీపై  బహిరంగంగానే నిరసన వ్యక్తం చేసిన  వీరు చివరికి  కంపెనీనుంచి  వైదొలగారు. ప్రొడక్ట్‌  వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ దేశాయ్, ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్,  విరాజ్ చటర్జీ, ఐటి అధిపతి గౌరవ్ గుప్తా ఈ కంపెనీ నుంచి తొలుత నిష్క్రమించగా,  ఇటీవల  ఎంసీజి బిజినెస్ హెడ్ దిగ్విజయ్ ఘోష్, జనరల్ మెర్కండైజ్ బిజినెస్ హెడ్ రాహుల్ జైన్ రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు టాప్‌ఎగ్జిక్యూటివ్స్‌  ఈ కోవలో చేరడం సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా పరిశ్రమ వర్గాలు  భావిస్తున్నాయి.

కాగా ఇటీవల ఇ కామర్స్‌  బిజినెస్‌లో అతిపెద్ద డీల్‌గా భావించిన ఫ్లిప్‌కార్ట్‌తో విలీనానికి స్వస్తి చెప్పిన  స్నాప్‌డీల్‌  భారీగా ఉద్యోగులకు తొలగించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement