స్టేట్ బ్యాంక్ ఎనీవేర్
Appకీ కహానీ...
దేశీ పీఎస్‌యూ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ తన సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన యాప్ ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’. ఈ యాప్ సాయంతో మనం దైనందిన బ్యాంకింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ యాప్‌ను ఇతర వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదు.
ప్రత్యేకతలు
* యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. యాప్‌ను ఓపెన్ చేయగానే మై అకౌంట్, బ్యాంకింగ్, బిల్ పేమెం ట్స్, టాప్‌అప్-రీచార్జ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
* మై అకౌంట్‌లోకి వెళ్లితే ట్రాన్సాక్షన్ అకౌంట్, డిపాజిట్ ఖాతా, లోన్ అకౌంట్, పీపీఎఫ్ ఖాతాలు కనిపిస్తాయి. ఆయా అకౌంట్లైపై క్లిక్ చేసి సంబంధిత వివరాలను పొందొచ్చు. ఎం-పాస్‌బుక్ ద్వారా లావాదేవీల సమాచారం పొందొచ్చు.
* బ్యాంకింగ్ ఆప్షన్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అది మన ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌లోకి కావచ్చు లేదా ఇతరుల ఖాతాల్లోకి కావచ్చు. అలాగే బ్యాంకింగ్ ఆప్షన్‌లో టీడీఎస్ ఎంక్వైరీ, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆధార్ సబ్సిడీ, ఏటీఎం/డెబిట్ కార్డ్ బ్లాక్, చెక్ బుక్ రిక్వెస్ట్, రికరింగ్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్స్‌ఫర్, క్విక్ ట్రాన్స్‌ఫర్, స్టేట్ బ్యాంక్ ఎం-క్యాష్, ఐఎంపీఎస్ వంటి తదితర సేవలను పొందొచ్చు.
* బిల్‌పే ద్వారా బిల్లులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించవచ్చు.
* టాప్‌అప్-రీచార్జ్‌లోకి వెళితే అక్కడ మొబైల్, డీటీహెచ్ సేవలను పొందొచ్చు. అంటే వాటిని రీచార్జ్ చేసుకోవచ్చు.