గురువారం వార్తల్లోని షేర్లు | Stocks in the news today | Sakshi
Sakshi News home page

గురువారం వార్తల్లోని షేర్లు

Published Thu, May 21 2020 10:19 AM | Last Updated on Thu, May 21 2020 10:33 AM

Stocks in the news today - Sakshi

క్యూ4 ఫలితాలు: బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ హోల్డింగ్స్‌, కాల్గెట్‌ పామోలీవ్‌ ఇండియా, హాకిన్స్‌, హిందుస్థాన్‌ జింక్, జూబ్లెంట్‌ ఇండస్ట్రీస్‌, క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌, టాటా మెటాలిక్స్‌, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం  వెల్లడించనున్నాయి.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: కోవిడ్‌-19 కారణంగా ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా జీఎంఆర్‌ కమలంగా ఎనర్జీ కొనుగోలు ఒప్పందాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వెల్లడించింది. ఒప్పందం చేసుకున్న మూడు నెలల తర్వాత ఈ కంపెనీ ఈ ప్రకటన చేసింది.

టాటా పవర్‌: ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.1.13 కోట్ల విలువైన నెదర్లాండ్స్‌ బివి కంపెనీలో 10 శాతం వాటాను టాటా పవర్‌ కొనుగోలు చేసింది.

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: మే 25 నుంచి దేశీయంగా విమాన సర్వీసులు నడపవచ్చని బుధవారం విమానయాన మంత్రి హర్దిప్‌ సింగ్‌ చేసిన  ప్రకటనతో నేడు ఏవియేషన్‌ షేర్లు దీని ప్రభావానికి లోనవుతాయి.

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్సెస్‌: మార్చి31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.206.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.44.70 కోట్లుగా ఉందని స్ట్రైడ్స్‌ ఫార్మా బీఎస్‌ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

మహీంద్రా లాజిస్టిక్స్: క్యూ4లో నికర లాభం 59 శాతం తగ్గి రూ.10 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.24 కోట్లుగా ఉందని ఒక ప్రకటనలో మహీంద్రా లాజిస్టిక్స్‌ వెల్లడించింది.

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌: ప్రైవేటు ప్రాతిపదికన ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా రూ.300 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. ఒక్కో ఎన్‌సీడీని రూ.10 లక్షలకు జారీ చేసేందుకు కమిటీ ఆఫ్‌ డిబెంచర్స్‌ ఆమోదం తెలిపినట్లు క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రీకల్స్‌ తెలిపింది.

కల్పతరు పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 92 శాతం తగ్గి రూ.13 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.166 కోట్లుగా ఉందని ఒక ప్రకటనలో కల్పతరు పవర్‌ ట్రాన్స్‌ మిషన్‌ తెలిపింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: వచ్చే 3-4 కాలంలో ఒక లక్ష మంది డాక్టర్లను టెలిమెడిసిన్‌ బోర్డులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది.  క్రమంగా ఈ-ఫార్మాసీ, హెల్త్‌ చెకప్స్‌, హెల్త్‌కేర్‌ వంటి సర్వీసులనీ విస్తరిస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.

బిర్లాసాఫ్ట్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4.5 శాతం పెరిగి రూ.69 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.66.1 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.

మ్యాట్రీమోనీ డాట్‌కమ్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.6.77 కోట్లుగా నమోదైందని మ్యాట్రీమోనీ వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.7.10 కోట్లుగా ఉంది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌: కోవిడ్‌-19 కారణంగా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌(పీఎస్‌బీఎస్‌)ఏర్పడిన  అనిశ్చితిపై సమీక్ష జరిపేందుకు ఈబ్యాంకుల సీఈఓలతో శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం కానున్నారు.

సుందరం ఫైనాన్స్‌: క్యూ4లో నికర లాభం రూ.82 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.26 కోట్లుగా ఉంది.

సీపీసీఎల్‌: నాలుగో త్రైమాసికంలో  స్టాండేలోన్‌ నికర నష్టం రూ.1,637.56 కోట్లుగా నమోదైనట్లు చెన్నై పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) వెల్లడించింది.

జూబ్లెంట్‌ ఫుడ్‌వర్క్స్‌: క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 57.96 శాతం తగ్గి రూ.32.53 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ తెలిపింది.

అజంతా ఫార్మా:క్యూ4లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 45శాతం పెరిగి రూ.129.16 కోట్లుగా నమోదైనట్లు అంజతా ఫార్మా వెల్లడించింది.

జీహెచ్‌సీఎల్‌: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 28.94 శాతం తగ్గి రూ.84.86 కోట్లుగా నమోదైనట్లు కెమికల్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ తయారీ సంస్థ జీహెచ్‌సీఎల్‌ వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement