stcoks
-
ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా!
దేశీ స్టాక్ మార్కెట్లలో బహుళజాతి కంపెనీలకు (ఎంఎన్‌సీలు) ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవి మంచి యాజమాన్యం నిర్వహణలో, సాంకేతికంగా, ఎన్నో బలాలతో కొనసాగుతుంటాయి. అనిశ్చిత పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాలతో ఉంటాయి. కానీ, గత మూడు, ఐదేళ్ల కాలంలో ఎంఎన్సీ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీలతో పోలిస్తే పెట్టుబడిదారులకు రాబడులను ఇచ్చే విషయంలో వెనుకబడ్డాయి. కానీ, ఇది ఎల్లకాలం కొనసాగబో దు. మళ్లీ ఇవి రాబడుల సైకిల్‌లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ క్రమంలో ఆకర్షణీయమైన వ్యాల్యూషన్ల వద్ద లభిస్తున్న ఎంఎన్సీల్లో పెట్టుబడులు పెట్టాలని కోరుకునేవారు.. ఎస్బీఐ మాగ్నమ్ గ్లోబల్ ఫండ్‌ను పరిశీలించొంచొచ్చు. రాబడులు మోస్తరు రిస్క్ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలం. లార్జ్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. విదేశీ ఈక్విటీల్లోనూ ఎక్స్పోజర్ తీసుకుంటుంది. దీర్ఘకాలం నుంచి నడుస్తున్న థీమ్యాటిక్ పథకాల్లో ఇది కూడా ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ పథకానికి 28 ఏళ్ల చరిత్ర ఉంది. ఆరంభం నుంచి చూసుకుంటే ఈ పథకంలో వార్షిక రాబడి రేటు 14.32 శాతంగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం నికరంగా ఎటువంటి రాబడులను ఇవ్వలేదు. అదే మూడేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా 17.52 శాతం చొప్పు న ప్రతిఫలాన్నిచ్చింది. ఐదేళ్లలో కాలంలో 11 శాతం, ఏడేళ్లలో 10 శాతం, పదేళ్లలో 16.51 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,824 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 94 శాతాన్ని కేటాయించింది. మిగిలిన పెట్టుబడులను నగదు, డెట్ రూపంలో కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 24 స్టాక్స్ ఉన్నాయి. మొదటి 10 స్టాక్స్‌లోనే 53 శాతం పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 45 శాతం, మిడ్‌క్యాప్ కంపెనీల్లోనూ 45 శాతానికి పైగా సమాన పెట్టుబడులను నిర్వహిస్తోంది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 8.59 శాతం కేటాయించింది. పెట్టుబడుల్లో కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ, 23 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఆ తర్వాత క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 19.44 శాతం, సేవల రంగ కంపెనీల్లో 13.92 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 11 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 8 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. పెట్టుబడుల విధానం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడిని వృద్ధిని చేసే విధంగా ఈ పథకం పనితీరు ఉంటుంది. ప్రధానంగా ఎంఎన్సీ కంపెనీలకు పెట్టుబడులు కేటాయిస్తూ, వైవిధ్యాన్ని పాటిస్తుంది. విదేశాల్లో లిస్ట్ అయిన ఎంఎన్సీల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. పోర్ట్‌ఫోలియోలోని 24 స్టాక్స్‌లో నాలుగు యూఎస్ స్టాక్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, నివిడా కార్పొరేషన్లో 18 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఎంఎన్సీ థీమ్‌తో నడిచే పథకం అయినప్పటికీ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని వాటికి కేటాయించే విధానంతో పనిచేస్తుంది. మిగిలిన 20 శాతాన్ని ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే వెలుసుబాటు ఉంది. -
భారత్ స్టాక్ మార్కెట్లో తగ్గతున్న విదేశీ పెట్టుబడులు, కానీ
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం తగ్గిపోతోంది. 2021 డిసెంబర్ చివరికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో.. విదేశీ ఇనిస్టిట్యూషన్స్ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) వాటాలు 9 ఏళ్ల కనిష్టానికి తగ్గాయి. కానీ, అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఇనుమడిస్తోంది. 14 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 0.81 శాతం తగ్గి 19.7 శాతానికి పరిమితమైంది. ఇలా ఎఫ్ఐఐల వాటాలు క్షీణించడం వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ నమోదైంది. నిఫ్టీ 500 కంపెనీల్లో అయితే డిసెంబర్ క్వార్టర్లో ఎఫ్ఐఐల వాటాలు 0.65 శాతం తగ్గి 20.9 శాతంగా ఉంది. ఈ వివరాలను ఎన్ఎస్ఈ నివేదిక వెల్లడించింది. 2021 మొత్తం మీద ఎఫ్ఐఐల వాటా ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2.04 శాతం, ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో 1.65 శాతం మేర తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వాటాలు తగ్గిపోవడం వెనుక గత ఏడాదిగా విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తుండడం ప్రధాన కారణంగా ఉంది. ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా ఆంక్షలు ఇలా ఎన్నో అనిశ్చితుల మధ్య విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణను నిరాటంకంగా, మరీ ముఖ్యంగా గత ఆరు నెలలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్లలో మారిన పరిస్థితి.. ఎఫ్ఐఐ పెట్టుబడులు ఎక్కువగా ఉండే కంపెనీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ 50 కంపెనీల్లో 0.21 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. నిఫ్టీ 500 కంపెనీల్లో 0.29 శాతం పెరిగి 9 శాతానికి.. ఎన్ఎస్ఈ మొత్తం లిస్టెడ్ కంపెనీల్లో 0.36 శాతం పుంజుకుని 9.7 శాతానికి రిటైల్ ఇన్వెస్టర్ల వాటాలు చేరాయి. గడిచిన రెండేళ్లలో ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రవేశం ఎన్నో రెట్లు పెరిగింది. కొత్త ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు, క్యాష్ మార్కెట్లో వారి లావాదేవీలు అధికమయ్యాయి. 2019 డిసెంబర్ త్రైమాసికం నుంచి చూస్తే 2021 డిసెంబర్ నాటికి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిటైలర్ల వాటా నికరంగా 1.3 శాతం పెరిగింది. ఫండ్స్‌కు సిప్ కళ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా రిటైలర్ల ప్రాతినిధ్యం పెరిగేందుకు దోహదం చేస్తోంది. సిప్ పెట్టుబడులు ప్రతీ నెలా కొత్త గరిష్టాలకు చేరుతుండడాన్ని గమనించొచ్చు. ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్పండ్స్ వాటా వరుసగా రెండో త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)లోనూ 0.11 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. 2020 మార్చి త్రైమాసికం నాటికి ఎన్ఎస్ఈ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్‌కు గరిష్టంగా 7.9 శాతం వాటా ఉంది. దీనికంటే ప్రస్తుతం 0.46 శాతం తక్కువగానే వాటి వాటా ఉన్నట్టు అర్థమవుతోంది. పెరుగుతున్న సిప్ పెట్టుబడులతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు లాభపడతున్నాయి. పెద్ద కంపెనీల్లోనే వీటి వాటాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సిప్ పెట్టుబడుల రాక వీటి ప్రాతినిధ్యం అధికమయ్యేందుకు సాయపడుతోంది. ఎన్ఎస్ఈ 500 కాకుండా ఇతర కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలు తగ్గడం గమనార్హం. చిన్న సంస్థల పట్ల ఎఫ్ఐఐల్లో ఆసక్తి ప్రధాన సూచీల్లోని కంపెనీల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో మాత్రం పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ పెట్టుబడుల పూల్‌లోకి కొత్తగా 260 కంపెనీలను వారు చేర్చుకున్నారు. 5 శాతానికి పైగా ఎఫ్ఐఐల పెట్టుబడులు ఉన్న కంపెనీల సంఖ్య 600 స్థాయిలోనే కొనసాగుతోంది. అంటే వారి నుంచి తాజా పెట్టుబడులు మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోకి వెళుతున్నట్టు అర్థమవుతోంది. -
ట్విటర్ ఎఫెక్ట్: టెస్లాకు భారీ షాక్!
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ట్విటర్‌ను రూ.3.36లక్షల కోట్ల(44 బిలయన్ డాలర్లు)కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొనుగోళ్లలో భాగంగా ట్విటర్ సంస్థకు 21బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉండగా..ఇందుకోసం మస్క్ టెస్లా షేర్లను అమ్మేస్తారనే ఊహాగానాల మధ్య పెట్టుబడు దారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం టెస్లా 126 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. ఒకవేళ టెస్లా షేర్లు అమ్మితే..మస్క్ ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మస్క్‌కి డబ్బులెక్కడివి! ఎలన్ మస్క్ ట్విటర్ డీల్‌కు టెస్లా కంపెనీకి సంబంధం లేదు. పైగా మస్క్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ట్విటర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారు. ఇదిగో ఇలాంటి ఎన్నో అనుమానాలు టెస్లా ఇన్వెస్టర్ల ఆందోళనకు కారణమయ్యాయి. ఆ భయాలతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా 12.2శాతం పడిపోయింది. ఈ సందర్భంగా వెబ్డష్ సెక్యూరిటీ అనలిస్ట్ డేనియల్ ఇవ్స్ మాట్లాడుతూ..మస్క్..ట్విటర్‌ను కొనుగోలు చేయడం..ట్విటర్‌కు చెల్లించేందుకు టెస్లా షేర్లను అమ్మేస్తారనే వార్తల నేపథ్యంలో టెస్లా షేర్లు నష్టపోవడానికి కారణమైందని అన్నారు. టెస్లా షేర్లు పడిపోవడానికి మరో కారణంగా టెస్లా షేర్ల పతనానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఎకానమీన మందగించడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదలపై పెట్టుబడి దారుల ఆందోళన మరో కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో నెలకొన్ని అనిశ్చితి కారణంగా మంగళవారం అమెరిన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ డిసెంబర్ 2020 నుండి నాస్డాక్ దాని కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ట్విటర్ లాస్ మస్క్ ట్విటర్ డీల్ నేపథ్యంలో ట్విటర్ షేర్లు భారీగా నష్టపోయాయి. 3.9శాతం పడిపోయి $49.68 వద్ద ముగిశాయి. అయినప్పటికీ మస్క్ సోమవారం ప్రతి షేరును నగదు రూపంలో $54.20కి కొనుగోలు చేయడానికి అంగీకరించడారు. మస్క్ తన $239 బిలియన్ల సంపదలో మెజారిటీ టెస్లా షేర్లే. ట్విటర్‌ను కొనుగోలుతో పెట్టుబడి దారులు అందోళన చెందడం.. ఆ ప్రభావం టెస్లా షేర్లపై పడినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పు చేసి పప్పుకూడు ఒప్పందంలో భాగంగా మస్క్ ఇప్పటికే తన టెస్లాలోని $12.5 బిలియన్ మార్జిన్ రుణాన్ని కూడా తీసుకున్నాడు. పైగా ఇప్పుడు మరిన్ని టెస్లా షేర్లు అమ్మడం పెట్టుబడి దారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అప్పు చేసి ట్విటర్‌ను కొనుగోలు చేయడంతో టెస్లా షేర్లు పడిపోయాయని,"టెస్లా షేరు ధర ఫ్రీఫాల్లో కొనసాగితే మస్క్‌కు ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఓఏఎన్డీఏ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్ మోయా అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి👉సంచలనం! ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్! -
రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం!
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న ప్రతికూలతలతో దేశీయ మార్కెట్ రెండో రోజూ వెనకడుగు వేసింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రెండున్నర శాతం క్షీణించింది. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సోమవారం సెన్సెక్స్ 617 పాయింట్లు క్షీణించి 57 వేల స్థాయిని కోల్పోయి 56,580 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయి ఐదు వారాల తర్వాత తొలిసారి 17 వేల దిగువన 16,954 వద్ద నిలిచింది. ఇటీవల కరెక్షన్‌లోనూ రాణించిన మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. విస్తృత మార్కెట్లోనూ చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు రెండుశాతం క్షీణించాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 22 పైసలు బలహీనపడి 76.64 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,303 కోట్ల షేర్లను అమ్మేయగా, దేశీ ఇన్వెస్టర్లు రూ. 1,870 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు చైనా రాజధాని బీజింగ్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి పలు ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధించారు. దీంతో ఆసియాలో చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్ దక్షిణ కొరియా, ఇండోనేసియాలతో సహా ప్రధాన మార్కెట్లన్నీ ఐదు శాతం మేర నష్టపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండునెలలైనా ఆగలేదు. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో కఠినతర ద్రవ్య విధానాలను అవలంబించాలని ఈసీబీ నిర్ణయించుకుంది. ఫలితంగా యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. ఫెడ్ రిజర్వ్ ఈ మేనెలలో వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో పాటు అవసరమైతే జూన్, జూలైలో కూడా రేట్లను పెంచొచ్చనే సంకేతాలతో అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండు శాతం నష్టాల్లో కదలాడుతున్నాయి. కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్లతో డిమాండ్ తగ్గొచ్చనే అంచనాలతో ఇంట్రాడేలో క్రూడాయిల్ ధరలు అనూహ్యంగా పతనాన్ని చూవిచూశాయి. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరల భగభగలు, సప్లై అవాంతరాలు తదితర ప్రతికూలతలకు తాజాగా నిరాశపూరిత కార్పొరేట్ మార్చి ఆర్థిక గణాంకాలు తోడయ్యాయి. ఇండోనేసియా విదేశాలకు పామాయిల్ ఎగుమతులను నిషేధించింది. ఈ పరిణామాలూ జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో బలహీనతలను నింపాయి ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 440 పాయింట్ల నష్టంతో 56,758 వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు క్షీణించి 17,009 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బలహీనంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోనూ కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మిడ్‌సెషన్ సమయంలో సెన్సెక్స్ 840 పాయింట్లు క్షీణించి 56,356 వద్ద, నిఫ్టీ 283 పాయింట్లు పతనమై 16,889 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే క్రూడాయిల్ పతనం నుంచి కొంత సానుకూలతలు అందుకున్న సూచీలు ట్రేడింగ్ చివర్లో స్వల్పంగా నష్టాలను తగ్గించుకున్నాయి. రెండురోజుల్లో రూ.6.47 లక్షల కోట్లు మాయం గడిచిన రెండురోజుల్లో సెన్సెక్స్ 1,332 పాయింట్ల పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6.47 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.265 లక్షల కోట్లుగా దిగివచి్చంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూప్ రూ.24,713 కోట్ల ఒప్పందం రద్దుతో ఆర్ఐఎల్తో పాటు ఫ్యూచర్స్ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్, ఫ్యూచర్ లైఫ్ స్టైయిల్ ఫ్యాషన్ షేర్లు 20 శాతం క్షీణించాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పదిశాతం, ఫ్యూచర్ రిటైల్ షేరు ఐదు శాతం పతనమైంది. ఫ్యూచర్ గ్రూప్‌లోని షేర్లన్నీ లోయర్ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్ అయ్యాయి. రిలయన్స్ షేరు బీఎస్ఈలో రెండున్నర శాతం క్షీణించి రూ.2,695 వద్ద స్థిరపడింది. ► నష్టాల మార్కెట్లోనూ ఐసీఐసీఐ బ్యాంకు షేరు రాణించింది. క్యూ4లో కంపెనీ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ షేరు ఒకశాతం లాభపడి రూ.753 వద్ద స్థిరపడింది. ఒక దశలో రెండు శాతం బలపడి రూ.762 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 8.54 లక్షల షేర్లు చేతులు మారాయి. -
మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ పెట్టుబడులు, 3.17 కోట్ల కొత్త ఫోలియోలు!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, వారి నుంచి వచ్చే పెట్టుబడులు కూడా ఇతోధికం అవుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22)లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు సంబంధించి 3.17 కోట్ల కొత్త ఫోలియోలు నమోదయ్యాయి. ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో చేసే పెట్టుబడి ఖాతాయే ఫోలియో. 2020–21 సంవత్సరంలో 81 లక్షల కొత్త ఖాతాలే తెరుచుకున్నాయి. దాంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతి గుప్తా పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం రేటు, ప్రజల్లో పెట్టుబడుల పట్ల అవగాహన ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమపై ప్రభావం చూపిస్తాయని ఆమె చెప్పారు. వడ్డీ రేట్లలో మార్పుల వల్ల మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొంటే ఇన్వెస్టర్లు ఆందోళనకు లోను కావచ్చని, అప్పుడు ఫోలియోలు తగ్గొచ్చని నియో (నియోబ్యాంకింగ్ కంపెనీ) స్ట్రాటజీ హెడ్ స్వప్నిల్ భాస్కర్ అభిప్రాయపడ్డారు. యాంఫి డేటా ప్రకారం.. 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో ఫోలియోల సంఖ్య 2022 మార్చి నాటికి 12.95 కోట్లకు పెరిగింది. 2021 మార్చి నాటికి ఈ సంఖ్య 9.78 కోట్లుగా ఉంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.37.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. చదవండి: మ్యూచువల్ ఫండ్స్ మురిపిస్తున్నాయ్..పెట్టుబడులు పెరుగుతున్నాయ్! -
గురువారం వార్తల్లోని షేర్లు
క్యూ4 ఫలితాలు: బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్, కాల్గెట్ పామోలీవ్ ఇండియా, హాకిన్స్, హిందుస్థాన్ జింక్, జూబ్లెంట్ ఇండస్ట్రీస్, క్విక్ హీల్ టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్, 3ఐ ఇన్ఫోటెక్ కంపెనీలు మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను గురువారం వెల్లడించనున్నాయి. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: కోవిడ్-19 కారణంగా ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా జీఎంఆర్ కమలంగా ఎనర్జీ కొనుగోలు ఒప్పందాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వెల్లడించింది. ఒప్పందం చేసుకున్న మూడు నెలల తర్వాత ఈ కంపెనీ ఈ ప్రకటన చేసింది. టాటా పవర్: ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1.13 కోట్ల విలువైన నెదర్లాండ్స్ బివి కంపెనీలో 10 శాతం వాటాను టాటా పవర్ కొనుగోలు చేసింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: మే 25 నుంచి దేశీయంగా విమాన సర్వీసులు నడపవచ్చని బుధవారం విమానయాన మంత్రి హర్దిప్ సింగ్ చేసిన ప్రకటనతో నేడు ఏవియేషన్ షేర్లు దీని ప్రభావానికి లోనవుతాయి. స్ట్రైడ్స్ ఫార్మా సైన్సెస్: మార్చి31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ.206.57 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.44.70 కోట్లుగా ఉందని స్ట్రైడ్స్ ఫార్మా బీఎస్ఈకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. మహీంద్రా లాజిస్టిక్స్: క్యూ4లో నికర లాభం 59 శాతం తగ్గి రూ.10 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.24 కోట్లుగా ఉందని ఒక ప్రకటనలో మహీంద్రా లాజిస్టిక్స్ వెల్లడించింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రీకల్స్: ప్రైవేటు ప్రాతిపదికన ఎన్సీడీల ఇష్యూ ద్వారా రూ.300 కోట్ల నిధులను సమీకరించనున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. ఒక్కో ఎన్‌సీడీని రూ.10 లక్షలకు జారీ చేసేందుకు కమిటీ ఆఫ్ డిబెంచర్స్ ఆమోదం తెలిపినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రీకల్స్ తెలిపింది. కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 92 శాతం తగ్గి రూ.13 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.166 కోట్లుగా ఉందని ఒక ప్రకటనలో కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్ తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్: వచ్చే 3-4 కాలంలో ఒక లక్ష మంది డాక్టర్లను టెలిమెడిసిన్ బోర్డులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది. క్రమంగా ఈ-ఫార్మాసీ, హెల్త్ చెకప్స్, హెల్త్‌కేర్ వంటి సర్వీసులనీ విస్తరిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. బిర్లాసాఫ్ట్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4.5 శాతం పెరిగి రూ.69 కోట్లుగా నమోదైందని ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.66.1 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. మ్యాట్రీమోనీ డాట్‌కమ్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.6.77 కోట్లుగా నమోదైందని మ్యాట్రీమోనీ వెల్లడించింది. 2019 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.7.10 కోట్లుగా ఉంది. పీఎస్‌యూ బ్యాంక్స్: కోవిడ్-19 కారణంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్(పీఎస్‌బీఎస్)ఏర్పడిన అనిశ్చితిపై సమీక్ష జరిపేందుకు ఈబ్యాంకుల సీఈఓలతో శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. సుందరం ఫైనాన్స్: క్యూ4లో నికర లాభం రూ.82 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.26 కోట్లుగా ఉంది. సీపీసీఎల్: నాలుగో త్రైమాసికంలో స్టాండేలోన్ నికర నష్టం రూ.1,637.56 కోట్లుగా నమోదైనట్లు చెన్నై పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) వెల్లడించింది. జూబ్లెంట్ ఫుడ్‌వర్క్స్: క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 57.96 శాతం తగ్గి రూ.32.53 కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ తెలిపింది. అజంతా ఫార్మా:క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45శాతం పెరిగి రూ.129.16 కోట్లుగా నమోదైనట్లు అంజతా ఫార్మా వెల్లడించింది. జీహెచ్‌సీఎల్: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 28.94 శాతం తగ్గి రూ.84.86 కోట్లుగా నమోదైనట్లు కెమికల్స్ అండ్ టెక్స్టైల్స్ తయారీ సంస్థ జీహెచ్‌సీఎల్ వెల్లడించింది. -
ఇసుక.. సమస్యలేదిక!
విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంది. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే సరఫరా చేస్తున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. విశాఖ జిల్లా అవసరాల కోసం ఆయా నదుల్లో కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా జోరందుకుంది. ఇక జిల్లాలో మరిన్ని స్టాక్ యార్డుల ఏర్పాటు ద్వారా ఇసుకను మరింత చేరువలో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట(విశాఖ దక్షిణం): గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ‘ఉచిత ఇసుక’ సాకుతో జరిగిన మాఫియా దోపిడీని నిరోధించి, ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందించాలని, అదే సమయంలో వాల్టా నిబంధనల ప్రకారం నదులను సంరక్షించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో గత ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఈసారి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో రుతుపవనాలు, తుపానుల ప్రభావంతో వర్షాలు అధికంగా కురిశాయి. దీంతో నదులన్నీ వరదతో పొటెత్తాయి. దాదాపు రెండు నెలల పాటు నిండుగా ప్రవహించాయి. గత పదేళ్లలో ఎప్పుడూలేని విధంగా జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకుఆటంకం ఏర్పడింది. తాజాగా బుల్బుల్ తుపాను గండం తప్పడంతో వరద మళ్లీ వచ్చే అవకాశం కూడా లేదు. నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. విశాఖ అవసరాల కోసం కేటాయించిన గోదావరి నదిలో రెండు రీచ్‌లు, శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రతి రోజూ సగటున 4 వేల నుంచి 5 వేల టన్నుల ఇసుక జిల్లాకు వస్తోంది. రీచ్‌ల్లో జోరుగా తవ్వకాలు విశాఖ నగరం, రూరల్ ప్రాంతాల్లో భవన నిర్మాణాల కోసం ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు రీచ్‌లను ప్రభుత్వం కేటాయించింది. పెదసవలాపురం, యరగాం, చవ్వాకులపేట రీచ్‌లను బల్క్ కొనుగోలుదారుల కోసం, గోపాలపెంట, మడపాం రీచ్‌లను రిటైల్ అవసరాల కోసం ప్రత్యేకంగా ఉన్నాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి, కాటవరం రీచ్‌లను బల్క్, రిటైల్ వినియోగదారుల కోసం కేటాయించారు. స్టాక్ యార్డుల్లో భారీగా నిల్వ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. విశాఖ నగర శివారు ముడసర్లోవ, అగనంపూడితో పాటు రూరల్‌లో నక్కపల్లి, నర్సీపట్నంలో ప్రస్తుతం ఇసుక స్టాక్‌యార్డులు నిర్వహిస్తున్నారు. చోడవరం, అనకాపల్లిలో ఏర్పాటు కోసం స్థలాన్వేషణ ఒకటీ రెండు రోజుల్లో కొలిక్కి రానుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో 8,076 టన్నులు, ముడసర్లోవలో 14,227 టన్నులు, నక్కపల్లిలో 650 టన్నులు, నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా దాదాపు 23 వేల టన్నుల మేర ఇసుక నిల్వ ఉందని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ యార్డుల్లో ఇప్పటివరకు 69,846 టన్నుల ఇసుక విక్రయాలు జరిగాయి. అక్రమ రవాణాపై ఉక్కుపాదం ఒకవైపు భవన నిర్మాణ అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచుతూనే మరోవైపు ఇసుక అక్రమ రవాణా నిరోధానికి జిల్లా యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. పర్యవేక్షణ కోసం నలుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించారు. జిల్లాకు కేటాయించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా ఇతర జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్రమార్కులను ఏమాత్రం ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకూ స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు పోలీసుల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సిండికేట్, మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇసుక ఆక్రమ సరఫరా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. సరఫరా పర్యవేక్షణకు కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను డిప్యూటీ కలెక్టరు స్థాయి అధికారికి అప్పగించారు. దూరం బట్టి రవాణా చార్జీలు స్టాక్ యార్డులో ఇసుక కోసం టన్ను రూ.375 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీచ్ నుంచి యార్డుకు కిలోమీటరును బట్టి రవాణా చార్జీ నిర్ణయించారు. టన్నుకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేస్తున్నారు. లోడింగ్ చార్జీలు టన్నుకు రూ.50 అదనం. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలోని మడపాం నుంచి విశాఖలోని ముడసర్లోవ ఇసుక స్టాక్ యార్డు వరకూ 115 కిలో మీటర్లు దూరం ఉంది. కిలోమీటరుకు రూ.4.90 చొప్పున టన్నుకు ధర లెక్కిస్తున్నారు. ఈ మేరకు టన్నుకు రూ.975 చొప్పున ధర నిర్ణయించినట్లు గనుల శాఖ సహాయ సంచాలకులు టి.తమ్మినాయుడు చెప్పారు. అలాగే గోదావరి ఇసుక టన్ను ధర రూ.1375 ఉంది. ఈ ప్రకారం ఆన్లైన్ www.rand.ap.gov.in లో వినియోగదారులు తమ పేరును ఆధార్, మొబైల్ నంబరు ద్వారా నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆర్డరు రసీదు రూపంలో ఓఆర్ కోడ్ సహా మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. గనుల శాఖ పోర్టల్ www.minerapgov లో నమోదైన వాహనం ద్వారా ఇసుకను రవాణా చేసుకోవచ్చు. ఈ వాహనం నిర్దేశిత ప్రాంతం చేరేవరకూ ధ్రువీకరణ కోసం ఇ–రవాణా పత్రం అధికారులు స్టాక్‌యార్డు వద్ద ఇస్తారు. -
మార్కెట్లకు మాన్సూన్ కిక్
ముంబై: బెటర్ మాన్సూన్ అంచనాలు దలాల్ స్ట్రీట్ లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఈసారి రుతుపవనాలు బాగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంతో పోలిస్తే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలపై వాతావరణ శాఖ అనుకూలమైన అంచనాలతో ఎరువులు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ మేకర్స్ ఎఫ్ఎంసిజి కంపెనీలకు మంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2 శాతానికిపైగా లాభాలతోబిఎస్ఇలో టాప్ సెక్టార్‌గా నిలిచింది. బుల్‌రన్‌లో ఇతర సెక్టార్లతోపాటు,ఎరువులు, విత్తనాలు కంపెనీల షేర్లపై మదుపర్ల ఆసక్తి నెలకొంది. కొనుగోళ్ల ధోరణి భారీగా కనిపిస్తోంది. దీంతో అన్నిఫెర్టిలైజర్స్, ఇతర విత్తనాల కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్సీఎఫ్ 4.85 శాతం, కోరమాండల్ ఇంటర్నేషనల్ 2.5 శాతం, జీఎస్ఎఫ్సీ 1.8 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2.4 శాతం, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 3.66 శాతం, జువారి ఆగ్రో 2 శాతం, అగ్రి టెక్ 4 శాతం పైగా పెరిగాయి. అలాగే జైన్ ఇరిగేషన్, ర్యాలీస్ ఇండియా ఎస్కార్ట్స్ లాభపడుతున్నాయి. దీంతోపాటు స్టాక్మార్కెట్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో జోరు కనిపిస్తోంది. ఈ రంగంలోని దాదాపు అన్ని స్టాక్స్‌లోను కొనుగోళ్లు పెరిగాయి. ఐటీసీ, ఇమామి, బ్రిటానియా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఈ లాభాల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైంని తాకి జోరుమీద ఉన్నాయి.