స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Jul 31 2017 12:33 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

స్టాక్స్‌ వ్యూ

స్టాక్స్‌ వ్యూ

మారుతీ సుజుకీ
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.7,630 టార్గెట్‌ ధర: రూ.8,863


ఎందుకంటే: మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. కార్ల అమ్మకాలు 13 శాతం పెరగడంతో నికర అమ్మకాల ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.17,550 కోట్లకు పెరిగింది. ప్రమోషన్, మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండడంతో పాటు జీఎస్‌టీ వ్యయాలు కూడా తోడవడంతో ఇబిటా మార్జిన్‌ 150 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 13.3 శాతానికి తగ్గిపోయింది. రూ.680 కోట్ల ఇతర ఆదాయం సాధించింది.

 అయితే అధిక పన్ను రేట్ల కారణంగా నికర లాభం 4 శాతం మాత్రమే పెరిగి రూ.1,560 కోట్లకు చేరింది. ప్రీమియమ్‌ కార్ల విక్రయాలు కోసం ఏర్పాటు చేసిన నెక్సా అవుట్‌లెట్ల అమ్మకాలు మొత్తం అమ్మకాల్లో 20 శాతంగా ఉన్నాయి.   ఈ క్యూ1లో కంపెనీ మార్కెట్‌ వాటా 55.5 శాతానికి పెరిగింది. ఉత్పత్తుల అభివృద్ధికి, పరిశోధన, అభివృద్ధి, షోరూమ్‌ల ఏర్పాటు కోసం స్థల సమీకరణ నిమిత్తం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ది సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో గుజరాత్‌ ప్లాంట్‌ పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించగలదు. వాహన రంగంలో డిమాండ్‌ పుంజుకుంటే అత్యధికంగా ప్రయోజనం పొందే కంపెనీ ఇదే కానున్నది. రెండేళ్లలో కంపెనీ అమ్మకాలు 13 శాతం, ఆదాయం 18 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.

అరవింద్‌
బ్రోకరేజ్‌ సంస్థ: వెంచుర సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.360 టార్గెట్‌ ధర: రూ.624


ఎందుకంటే: జీఎస్‌టీ అమలు కారణంగా అత్యధికంగా ప్రయోజనం పొందే పెద్ద కంపెనీల్లో ఇది ప్రధానమైనది. టెక్స్‌టైల్స్‌ రంగంలో మొత్తం 75 శాతం మార్కెట్‌ వాటా ఉన్న అసంఘటిత రంగం నుంచి అధిక భాగం మార్కెట్‌ వాటా ఈ కంపెనీకే దక్కే అవకాశాలున్నాయి. అప్పారెల్‌ బ్రాండ్ల విషయానికొస్తే, యారో, యూఎస్‌ పోలో, ఫ్లైయింగ్‌ మెషీన్, టామీ హిల్‌ఫిగర్, కాల్విన్‌ క్లెయిన్, తదితర బ్రాండ్లలో కొన్నికంపెనీ సొంతానివి కాగా, మరికొన్నింటికి లైసెన్స్‌లు పొందింది. ఎంట్రీ లెవల్, మధ్య తరహా, ప్రీమియమ్‌ బ్రాండ్లు.. ఇలా అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండే బ్రాండ్లు ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.

 భారత్‌లో బ్రాండెడ్‌ దుస్తులకు డిమాండ్‌ బాగా పెరగగలదని, ఈ అవకాశాలను ఈ కంపెనీ అందిపుచ్చుకోగలదని అంచనా.  డెనిమ్‌ వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అతి పెద్ద ప్రపంచ కంపెనీల్లో ఇది ఒకటి. తక్కువ వేతనాలు, అనేకమైన రాయితీలు లభిస్తున్న, యూరప్‌ మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఇథియోపియోలో దుస్తుల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం,  దుస్తుల బ్రాండ్‌ పోర్ట్‌ ఫోలియో అత్యధిక వృద్ధి,  రిటైల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్‌లిమిటెడ్‌(గతంలో మెగామార్ట్‌ స్టోర్స్‌) సంస్థ ఆదాయం, లాభదాయకత మెరుగుపడుతుండడం సానుకూలాంశాలు. మూడేళ్లలో కంపెనీ ఆదాయం 13.5% చక్రగతి వృద్ధితో రూ.13,503 కోట్లకు, నికర లాభం 29% వృద్ధితో రూ.680 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement