
న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతుల ఆదా రూపంలో ఏటా రూ.1.2 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని నీతి ఆయోగ్ పేర్కొంది. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలను మార్చడం ద్వారా భారత్ ఎంతో లబ్ధి పొందొచ్చని ప్రభుత్వానికి సూచించింది.
మూవ్ సదస్సులో ఈ నివేదికను ప్రధాని మోదీకి నీతి ఆయోగ్ సమర్పించింది. ‘‘దేశంలో 17 కోట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనం రోజూ సగటున అర లీటర్ పెట్రోల్ ఖర్చు చేస్తుందనుకుంటే... ఏడాదికి అన్ని వాహనాలకు కలిపి 34 బిలియన్ లీటర్లు అవసరమవుతుంది. లీటర్‌కు రూ.70 చొప్పున ఏడాదికి ఖర్చు రూ.2.4 లక్షల కోట్లు. ఇందులో సగాన్ని పరిగణనలోకి తీసుకున్నా రూ.1.2 లక్షల కోట్లను ఆదా చేయవచ్చు’’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment