డెలివరీ తీసుకున్నాకే నగదు; ఈజీ రిఫండ్స్
ఆన్‌లైన్ నాణ్యతకు ఫ్లిప్‌కార్ట్ భరోసా
హైదరాబాద్: ఆన్‌లైన్ షాపింగ్‌లో మనం వస్తువులను మాత్రమే చూస్తాం. అక్కడ దాని నాణ్యతను తెలుసుకోగలమా? లేదు. అలాంటప్పుడు ఈ-కామర్స్ సంస్థలను నమ్మడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తోంది ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. కస్టమర్ల సౌలభ్యం కోసం పేమెంట్ చెల్లింపుల్లో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆప్షన్‌ను అందిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే డెలివరీ అయిన వస్తువుల్లో ఎమైనా డ్యామేజ్ ఉన్నా, నాణ్యత పరమైన లోపాలున్నా, ఇతర సమస్యలున్నా కూడా వాటిని తిరిగి వెనక్కిచేసే పద్ధతిని ఏర్పాటు చేశామని పేర్కొంది. తాము ఎల్లప్పుడూ నాణ్యమైన బ్రాండెడ్ వస్తువులనే వినియోగ దారులకు అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది.