టాటా ‘మోవస్’ @రూ. 6.99 లక్షలు | tata movus to replace sumo grande, | Sakshi
Sakshi News home page

టాటా ‘మోవస్’ @రూ. 6.99 లక్షలు

Published Wed, May 7 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

టాటా ‘మోవస్’ @రూ. 6.99 లక్షలు

టాటా ‘మోవస్’ @రూ. 6.99 లక్షలు

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ఎంట్రీలెవెల్ యుటిలిటీ వాహనం ‘మోవస్’ను మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. దీని ధర రూ.6.99 లక్షల నుంచి(ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ) ప్రారంభమవుతుం దని కంపెనీ వెల్లడించింది. ‘పెద్ద కుటుంబాల కోసం విశాలంగా ఉండటంతో పాటు, సులువైన నిర్వహణ, దగ్గర, దూర ప్రయాణాలకు అనువుగా మోవస్‌ను రూపొందించాం. సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీపడకుండానే అత్యుత్తమ విలువలతో ఈ వాహనం లభిస్తుంది. 2.2 లీటర్ వేరికార్ ఇంజిన్ కలిగిన ఈ వాహనం సిటీ, హైవేలు రెండింటికీ ఉపయోగకరంగా ఉంటుంది’ అని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్రయాణికుల వాహన విభాగం) రంజిత్ యాదవ్ పేర్కొన్నారు. మెట్రో, కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోని అన్ని డీలర్‌షిప్ కేంద్రాల్లోనూ మోవస్ లభ్యమవుతుందని రంజిత్ యాదవ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement