
టాటా సన్స్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్
న్యూఢిల్లీ: టాటా సన్స్ గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్ నియమితులయ్యారు. టాటా సన్స్‌లో గత 17 ఏళ్లుగా గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా వ్యవహరిస్తూ వస్తున్న భరత్ వాసని స్థానాన్ని శువ మండల్ భర్తీ చేయనున్నారు. శువ మండల్ జూలై నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని టాటా సన్స్ పేర్కొంది. కాగా ఈయన నేషనల్ లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.