హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని అతిపెద్ద డయాలసిస్ కేర్ నెట్‌వర్క్ నెఫ్రోప్లస్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరణ చేపట్టింది. వచ్చే ఏడాది కాలంలో రూ.75 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ కొత్తగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 40 సెంటర్లున్నాయి. ఫిబ్రవరి నాటికి ఏపీలో కొత్తగా 3 సెంటర్లను ప్రారంభించనున్నట్లు నెఫ్రోప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ ఉప్పాల ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. అమెరికాకు చెందిన డావాటా హెల్త్‌కేర్ కంపెనీ ఇండియా విభాగాన్ని కొనుగోలు చేసిన సందర్భంగా సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు.
రెండేళ్లలో లిస్టింగ్..
‘‘గతేడాది రూ.150 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. డావిటా కొనుగోలుతో రూ.50 కోట్ల టర్నోవర్ జతయింది. దీంతో ఈ ఏడాది రూ.250 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యస్తున్నాం’’ అని చెప్పారాయన. రెండేళ్లలో కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో నెఫ్రోప్లస్‌కు 93 నగరాల్లో 154 సెంటర్లున్నాయి. డావిటా కొనుగోలుతో ఈ సంఖ్య 176కు చేరింది.
జనవరిలో రూ.150 నిధుల సమీకరణ
‘‘ప్రస్తుతం నెఫ్రోప్లస్‌లో 2,400 మంది ఉద్యోగులున్నారు. రోజుకు 7 వేల మందికి డయాలసిస్ సేవలందిస్తున్నాం. జనవరి నాటికి రూ.150 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలు వెంచర్ క్యాపిటలిస్టులతో చర్చలు జరుపుతున్నాం’’ అని విక్రమ్ తెలిపారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజీలో లిస్ట్ అయిన కిడ్నీ డయాలసిస్ కేర్ డావిటా హెల్త్‌కేర్ ఇండియా విభాగమైన డావిటా కేర్ ఇండియాను... నెఫ్రోప్లస్ కొనుగోలు చేసింది. దీంతో డావిటా ఇండియాకు చెందిన 22 కేంద్రాలు, 1,700 మంది పేషెంట్లు, 400 మంది ఉద్యోగులు నెఫ్రోప్లస్‌లో విలీనమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరో 30 నెఫ్రోప్లస్ కేంద్రాలు
Published Tue, Nov 6 2018 2:08 AM | Last Updated on Tue, Nov 6 2018 2:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment