సింగపూర్ కు మరో 2 సర్వీసులు: టైగర్ఎయిర్ | Tigerair adds two more flights to strengthen India operations | Sakshi
Sakshi News home page

సింగపూర్ కు మరో 2 సర్వీసులు: టైగర్ఎయిర్

Published Thu, Jan 21 2016 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

సింగపూర్ కు మరో 2 సర్వీసులు: టైగర్ఎయిర్

సింగపూర్ కు మరో 2 సర్వీసులు: టైగర్ఎయిర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన యాన రంగంలో ఉన్న టైగర్‌ఎయిర్ మరో రెండు సర్వీసులను భారత్ నుంచి సింగపూర్‌కు నడుపనుంది. ప్రస్తుతం భారత్‌లోని ఆరు నగరాల నుంచి వారానికి 44 సర్వీసులు నడుస్తున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 మధ్య హైదరాబాద్, తిరుచిరాపల్లి నగరాలకు ఒక్కో సర్వీసును జోడిస్తోంది.

దీంతో మొత్తం సర్వీసుల సంఖ్య హైదరాబాద్-సింగపూర్ మధ్య ఏడు, తిరుచిరాపల్లి-సింగపూర్ మధ్య 14కు చేరుకుంటాయి. హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు రానుపోను రూ.11.599 నుంచి టికెట్స్‌ను టైగర్‌ఎయిర్ ప్రకటించింది. బుకింగ్ కాలం జనవరి 20 నుంచి 31. ప్రయాణ తేదీలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 16.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement