అంతర్జాతీయ రూట్లలోనూ డిస్కౌంట్లు | qatar airways discount upto 25 percent in international routes | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ రూట్లలోనూ డిస్కౌంట్లు

Published Tue, Sep 16 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

అంతర్జాతీయ రూట్లలోనూ డిస్కౌంట్లు

అంతర్జాతీయ రూట్లలోనూ డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: ధరల తగ్గింపు ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులకూ విస్తరించింది. తాజాగా ఖతార్ ఎయిర్‌వేస్, సింగపూర్ చౌక ధరల విమానయాన సంస్థ టైగర్ ఎయిర్‌లు అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లపై డిస్కౌంట్లను ప్రకటించాయి. ద వరల్డ్ ఈజ్ యువర్స్ పేరుతో ఖతార్ ఎయిర్‌వేస్ 25 శాతం వరకూ డిస్కౌంట్‌నిస్తోంది. అలాగే రూ.10(బేస్‌ధర)కే సింగపూర్‌కు విమానయానాన్ని టైగర్‌ఎయిర్ సంస్థ ఆఫర్ చేస్తోంది.

వివరాలు..
 టైగర్‌ఎయిర్ బంపర్ ఆఫర్...
 కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లైన సందర్భంగా టైగర్‌ఎయిర్ సంస్థ రూ.10(బేస్ ఫేర్) కే సింగపూర్‌కు విమానయానాన్ని ఆఫర్ చేస్తోంది. ఇతర వ్యయాలు, పన్నులు కలుపుకొని ఈ చార్జీ కనిష్టంగా రూ.7,499 ఉంటుందని టైగర్ ఎయిర్ పేర్కొంది. భారత్ నుంచి రౌండ్‌ట్రిప్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని టైగర్‌ఎయిర్ తెలిపింది. ఈ నెల 21 వరకూ టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే ఏడాది జనవరి 12 నుంచి మార్చి 31 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. మరిన్ని నగరాలకు కూడా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామని వివరించింది.  బాలి, జకార్తా, పెర్త్, మనీలా, హాంకాంగ్, సిడ్ని, గోల్డ్‌కోస్ట నగరాలకు స్పెషల్ ఆల్-ఇన్ రిటర్న్ చార్జీలు రూ.11,999 నుంచి ప్రారంభమవుతాయని టైగర్ ఎయిర్ పేర్కొంది.

 ఖతార్ డిస్కౌంట్ 25 శాతం వరకూ
 ఇక ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థ ద వరల్డ్ ఈజ్ యువర్స్ పేరుతో తన విమాన టికెట్లపై 25 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 140 రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నామని, బుధవారం ముగుస్తాయని వివరించింది. ఈ నెల 25 నుంచి వచ్చే నెల జూన్ 15 వరకూ జరిగే విమాన ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. భారత్ నుంచి దోహా ద్వారా ప్రయాణమయ్యే రిటర్న్ టికెట్లకు, అన్ని క్లాసుల టికెట్లకు  ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని వివరించింది. ఈ సంస్థ భారత్ నుంచి దోహా మీదుగా బార్సిలోనా, డల్లాస్, లండన్, మియామి, న్యూయార్క్, ప్యారిస్, రోమ్, తదితర 12 నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement