టైటాన్ కళ్లజోళ్ల ఉత్పత్తుల జోరు
బెంగళూర్: కళ్లజోళ్లను అందిస్తున్న టైటన్ ఐవేర్... ఫ్రేమ్‌ల తయారీలోకి అడుగుపెడుతోంది. రెండు దశలుగా ఈ తయారీ చేపట్టాలని కంపెనీ భావిస్తోంది. తొలి దశ సామర్థ్యం ఏడాదికి 10 లక్షల ఫ్రేమ్‌లు. ‘‘తొలిదశలో కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ప్లాంటు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి ఆగస్టు-సెప్టెంబర్‌లో మొదలవుతుంది. దీనికి రూ.40 కోట్ల ఆరంభ పెట్టుబడి పెడుతున్నాం’’ అని టైటన్ ఐవేర్ సీఈఓ రోనీ తలాటీ చెప్పారు. మంగళవారమిక్కడ ఐ-ప్లస్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.