
రూ.5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటేనే ఈపీఎఫ్‌ఓ నిధులు
న్యూఢిల్లీ: కనీసం రూ.5,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న లిస్టెడ్ కంపెనీల్లోనే ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) తన నిధులను ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఈ ఏడాదికి ఎక్స్ఛేంజ్ ట్రేటెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లోనే పీఎఫ్ నిధుల ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందని కొత్త పెట్టుబడి నిబంధనలు వెల్లడిస్తున్నాయి. ఈ నిబంధనలను కార్మిక శాఖ గతనెల 23న నోటిఫై చేసింది. ఈ ఏడాది ఈటీఎఫ్‌ల్లో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. ఇది సంస్థ ఏడాదికి పెరిగే డిపాజిట్లలో(రూ.1 లక్ష కోట్లు)5%కి సమానం.