
gold price
బుధవారం పసిడి ధర భారీగా పెరిగింది. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.495 పెరిగి 10 గ్రామలు పసిడి రూ.47,250 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పుంజుకున్నాయి. పసిడి ఫ్యూచర్స్ 1శాతం పెరగగా వెండి 3 శాతం పెరిగింది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర పరుగులు పెడుతోంది. నిన్నటితో పోలిస్తే 19 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం 1,753.25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడిగా భావించి బంగారంపై పెట్టుబడులు పెడుతుండడం వల్ల పసిడి ధరలు పుంజుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment