శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్ ముగిసే సమయానికి రూ.374 పెరిగి,10 గ్రాముల పసిడి ధర రూ.47,061 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం సెషన్‌లో 10 గ్రాముల పసడి రూ.46,466 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.47,130 వద్ద గరిష్టాన్ని తాకింది. నిన్న ఒక్కరోజే 1.4 శాతం పసిడి ధర పుంజుకుంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర 7 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం 1,734.70 డాలర్ల వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment