![కాల్ డ్రాప్స్‌పై కఠిన చర్యలు](/styles/webp/s3/article_images/2017/09/17/71503095472_625x300.jpg.webp?itok=DrcL-gwA)
కాల్ డ్రాప్స్‌పై కఠిన చర్యలు
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింత సీరియస్‌గా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే దశలవారీగా రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది.